వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విరాళం 120 కోట్లు

వరద బాధితులకు ఉద్యోగులు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబరు నెల జీతం నుంచి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తునట్లు ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒకరోజు బేసిక్‌ పే సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్‌ హృదయరాజు, ఏపీ యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,. ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, ఏపీ జేఏసీ ఎన్టీఆర్‌ జిల్లా చైర్మన్‌ విద్యాసాగర్‌, ఎన్జీవో సంఘం నాయకుడు జగదీశ్‌, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాస్‌, పీఏవో ఉద్యోగుల అధ్యక్షుడు హరినాథ్‌బాబు, గ్రామ సచివాలయ సంఘం అధ్యక్షుడు జానీ బాషా, ఇతర సంఘాల నేతలు సీఎం చంద్రబాబును కలసి అంగీకార పత్రాన్ని అందజేశారు. అలాగే ఏపీ సచివాలయ సంఘం నాయకులు సీఎంను కలిసి ఒకరోజు మూల వేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు విరాళంగా అందజేశారు. పెద్దఎత్తున విరాళాలు అందించిన దాతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

Lమీ బేసిక్ పే ప్రకారం CM Relief Fund కు సెప్టెంబర్ 2024 జీతంలో డిడక్ట్ అయ్యే అమౌంట్.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top