ZPPF GPF AP General Provident Fund Raules - Annual Statements - Related forms ZPPF/GPF Annual Statements/ZPPF Slips of ZPPF/GPF, District Wise Statements of Srikakualm, Vizainagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasam, Kurnool, YSR Kadapa, Chittoor,Anantapura,Nellore.
ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులుకు సాంఘిక భద్రత కల్పించే ప్రధాన లక్ష్యం తో 1963 లో సాధారణ భవిష్యనిధి ఏర్పాటు చేయబడినది. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, గ్రంధాలయ సంస్థలు తదితర యాజమాన్యాల క్రింద పనిచేయ ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఇవే నిబంధనలతో ఆయా సంస్థలు ఈ నిధిని నిర్వహిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా సంస్థలు నిధిని నిర్వహిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ.జి. కార్యాలయము జి.పి.ఎఫ్. పేర ఈ నిధిని నిర్వహిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఒక నిర్బంద పొదుపు పధరం ప్రభుత్వమే దీనిక ఒక ట్రస్ట్
ZPPF GPF AP General Provident Fund Rules - Annual Statements ఆంధ్రప్రదేశ్ సాధారణ భవిష్యనిధి( ఏ.పి.జి పి యఫ్) నిబంధనలు అవగాహన:
పి.యఫ్. ఉద్దేశ్యాలు :
1) ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా కాలధర్మం చేసినప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత మరియు మద్దతు కలిగించుట. (2) పదవీ విరమణ అనంతం ప్రతి ఉద్యోగికి ఆర్థిక వెసులుబాటు ఏర్పరచడం (3) అత్యవసర సందర్భాలలో ఉద్యోగికి ఆర్థిక తోడ్పాటు అందించడం.
పి.యఫ్. ప్రత్యేకత:
ఫండ్ భారత రాష్ట్రపతి అధీనంలో నిర్వహించబడుతుంది. నిబంధన 20,21 ప్రకారము భారతదేశములోని ఏ కోర్టు ఆదేశములు ఈ ఫండ్ ద్వారా జరిగే చెల్లింపులను నిలిపివేయలేవు. అనగా ఉద్యోగి ఏ వ్యక్తి లేక సంస్థ ద్వారా తీసుకున్న అప్పుడు రికవరీకి ఈ ఫం విల్వకు అటాచ్మెంటును కోర్టు ఇవ్వలేదు. ఈ చందా చట్టబద్దమైన మినహాయింపు (స్టాట్యూటరీ డిడక్షన్) ఇన్కంటాక్స్ నుండి రూ. లక్ష వరకు మినహాయింపు కలదు.
పి.యఫ్.లో సభ్యత్వం ఖచ్చికమా? తప్పనిసరా?
5.1-3-1963 నుండి ది.31-8-2004 (0.1-9-2004 నుండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చినది) మధ్యకాలంలో సర్వీస్ చేసిన ప్రతి ఉద్యోగి ఒక సంవత్సరం లోపుగా ఈ నిధిలో తప్పక చందాదారునిగా చేరాలి.. పి.యఫ్.లో చేరుటకు నిర్ణీత ప్రాపార్మాలో ధరఖాస్తుతో పాటు నామినేషన్ ఫారములు 2 సెట్లలో పూర్తి చేసి కార్యాలయ అధికారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగులైతే ఎ.జి. ఆఫీసుకు, పంచాయితీరాజ్ ఉద్యోగులైతే జె.పి. కార్యాలయమునకు పంపుకోవాలి. పై దరఖాస్తులు సంబంధిత కార్యాలయము వారు పరిశీలించి పి.యఫ్. అకౌంట్ నంబరు కేటాయించి పి.యఫ్.. చందాదారుడైనట్లు ప్రకటిస్తారు. ఈ నంబరు మరియు నామినేషన్ వివరములను సేవా పుస్తకములో నమోదు చేయాలి.
పి.యఫ్. నెలసరి చందా పరిమితి ఎంత?
ఎప్పటికప్పుడు వచ్చిన నూతన స్కేళ్ళకు అనుగుణంగా పి.యఫ్. స్లాబులు సవరించలేదు. (ది.1-3-1963లో నిర్ణయించిన స్థాయిలే ఇప్పటికి నిబంధనలే పొందుపరచి ఉన్నవి. అయినప్పటికి చందాలను కొత్త స్కేళ్ళలోని జీతాల ఆధారంగానే స్లాబులు ప్రకారమే చెల్లించాలి. దీని ప్రకారము యల్.ఐ.సి/ఎ.పి.జి.యల్.ఐ.సి పి.యల్.ఐ మొదలగు ఇన్సూరెన్స్ ప్రీమియములు చెల్లించేవారు నెల జీతములో 65 చొప్పున ఇన్సూరెన్స్ ప్రీమియములు చెల్లించనివారు జీతంలో 12% చొప్పున నెలసరి చందాను విధిగా ప్రతి నెల జీతపు బిల్లులో మినహాయింపు ద్వారా సంబంధిత కార్యాలయమునకు చెల్లించబడాలి.
పి.యఫ్. చందాను పెంచుకోవచ్చా? తగ్గించుకోవచ్చా?
అవును అయితే ప్రతి ఆర్ధిక సంవత్సరములోను చందా మొత్తాన్ని రెండు సార్లు పెంచుకొనుటకు ఒకసారి తగ్గించుకొనుటకు మాత్రమే వీలుగలదు. అయితే పి.యఫ్. చందా జీతంలో గరిష్టంగా 50% మించరాదు.
పి.యఫ్. చందా చెల్లింపుకు మినహాయింపు కలదా?
ఈ చందా తప్పనిసరి అయినప్పటికి సస్పెన్షన్లో ఉండి సబిసిస్టెన్స్ ఎలవెన్స్ పొందుతున్న కాలములో చందా మరియు అప్పు చెల్లింపుల నుండి మినహాయింపు కలదు. (అయితే ఉద్యోగి ఇష్టతపై ఈ మినహాయింపును చేయవచ్చును) వేతనం లేని సెలవు (జీతపు నష్టపు తెలవు)లో ఉన్నప్పుడు నిధికి చందా వసూలు చేయబడదు. ఉద్యోగి పదవీ విరమణకు 4 నెలలు ముందుగా చందా వసూలు నిలిపి వేయవలెను. అయితే అప్పు వసూలు చేయవచ్చును.
పి.యఫ్.లో నిల్వఉన్న సొమ్ముకు వడ్డీ ఎంత?
ది. 1-4-2004 నుండి సంవత్సరానికి 8% చొప్పున వార్షిక నిల్వపై వడ్డీ చెల్లించబడును. అసలు సంవత్సరములోని జమ మొత్తము
పి.యఫ్. నుండి అప్పు పొందవచ్చా? ఎట్లు?
పి.యఫ్. అప్పు రెండు విధములుగా ఇవ్వబడును. అవి 1) టెంపరరీ అడ్వాన్స్ (రిఫండబుల్ లోన్) 2) పార్ట్ ఫైనల్ (వాన్ రిఫండబుల్) 1) టెంపరరీ ఎడ్వాన్స్ ఏ సందర్భములో తీసుకోవచ్చు. "జి.పి.యఫ్. రూల్ 14 మరియు దాని సబ్సిడరీ రూల్స్ ప్రకారము 10 రకాలైన అప్పులు ఈ పద్దతిలో మంజూరు చేస్తారు. ఇది సాధారణముగా 3 నెలల జీతం లేక నిల్వలో సగభాగం ఏది తక్కువైతే అదిమంజూరు చేయబడును. అసాధారణ పరిస్థితుల్లో ఉద్యోగి యెక్క అవసరములను గుర్తించి మంజూరు అధికారి విచక్షణకు లోబడి 3/4 వంతు కూడా మంజూరు చేయవచ్చును.
అప్పు ఇచ్చు సందర్భములు :
1) చందాదారులకు తన కుటుంబసభ్యులకు దీర్ఘవ్యాధులకు చికిత్స చేయించు సందర్భములో (మెడికల్ సర్టిఫికేట్)
2) పిల్లల చదువులకు (రశీదు జతపరచాలి).
3)మతపరమైన ధార్మిక కార్యక్రమములు నిర్వహించునిమిత్తము, వివాహాలు, నిశ్చితార్ధములు, దినములు, పుట్టినరోజులు వగైరా (ఆధారాలు చూపాలి)
4) న్యాయసంబంధ ఖర్చులకు (కోర్టులో వ్యాజ్యమునకు సంబంధించిన ఆధారము చూపాలి)
5) ప్రభుత్వ పరంగా న్యాయ వివాదార్థల ఎదుర్కొన్నప్పుడు
6)ఇంటి నిర్మాణం, కొనుట, ఇంటి మరమత్తులు (ఆధారాలు, డాక్యుమెంట్లు చూపాలి)
7)ఇంటి స్థలం కొనుటకు, (అగ్రిమెంటు చూపాలి).
8)పదవీ విరమణకు 6 నెలల ముందుగా వ్యాపారస్థలం, పొలం కొనుటకు (అగ్రిమెంటు చూపాలి)
9) మోటారు సైకిలు, కొనుటకు (కొటేషన్ కాని రశీదుకాని చూపాలి)
ఈ అప్పును 12,24 ప్రత్యేక పరిస్థితుల్లో 36 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఈ అప్పు కిస్తీకి కూడా బిల్లులో చందాకు అదనంగా మిహాయించాలి.
ఒకసారి తీసుకొనిన అప్పు పూర్తిగా తీరకుండా మరలా అప్పును (మొదటి అప్పు తీసుకొన్న 6 నెలల తర్వాత మాత్రమే) పాత అప్పులో, మిగులు మొత్తం మరియు కొత్తగా తీసుకొన్న మొత్తమును కలిపి మంజూరు చేసి ఆ మొత్తముపై నెలసరి కిస్తీని నిర్ణయిస్తారు. (రూల్ 14-3).
బి) తిరిగి చెల్లించనవసరంలేని అడ్వాన్సులు (పార్టుఫైనల్) : సాధారణ భవిష్యనిధిలో నిల్వయున్న మొత్తము నుండి కొంత శాశ్వతంగా క్రింది. కారణాలపై తీసుకొనవచ్చును. వీటిని తిరిగి చెల్లించనవసరంలేదు. 1) ఎ) రూలు 15(ఎ) (1) ప్రకారం 20 సంవత్సరాలు సర్వీసు నిండిన మరియు 10 సం||లోపు ఉద్యోగ విరమణ చేయువారికి, 3 నెలల పే గాని, 1/2 బ్యాలెన్సు మొత్తంగాని లేక ప్రత్యేక పరిస్థితిలో 10 నెలల బేసికే వరకు మంజూరు చేస్తారు. దీనికి విద్యాపరమైన ఉన్నత కోర్సులు చదువుకొనుటకు, అందు నిమిత్తం ప్రయాణఖర్చుల కొరకు మంజూరు చేయబడుతుంది. బి) రూలు 15(ఎ) (1) (బి) ప్రకారం పెళ్ళి, ఇతర కుటుంబపరమైన కార్యములు నిర్వహించుటకు కూడా ఈ విధమైన పార్ట్ ఫైనల్ అడ్వాన్సు మంజూరు చేస్తారు.
సి) రూలు 15(ఎ) (1) (సి) ఆరోగ్య కారణాలపన కూడా ఈ విధమైన పార్ట్సెనల్ అడ్వాన్సు 3/4 భాగం వరకూ మంజూరు చేస్తారు. 2 రూలు 15(ఎ) 2) ప్రకారం ఇల్లు కట్టుకోవటానికి, ఇంటి మరమ్మత్తులకు 15 సం"ల సర్వీసు నిండి, ఇంటి పునర్నిర్మాణాలకు పదవీ విరమణకు ముందు 10 సం॥ల సర్వీసు మిగిలి ఉన్నవారికి, అన్ని అనుమతులతో కూడిన ఇంటికి సంబంధించిన నకళ్ళు ఉన్నప్పుడు, 3/4 భాగం జి.పి.ఎఫ్. మొత్తంలో మంజూరు చేస్తారు. ఈ విధంగా మంజూరైన మొత్తాన్ని 6 నెలలలోపుగా ఉపయోగించవలెను.
3) రూలు 15(4) ననుసరించి వ్యవసాయభూమి కొనుక్కోవటానికి వాణిజ్యపరమైన షాపులు కొనుటకు కూడా పార్టెఫైనల్ అడ్వాన్సు, 1/2 భాగంగాని లేక 6 నెలల పూ గాని మంజూరు చేస్తారు.
4) రూలు 15(1) ప్రకారం మోటారు సైకిలు కొనుక్కోవటానికి 28 సం॥ల నిండిన సర్వీసు ఉంది. పదవీ విరమణకు ముందు 3 సం||ల సర్వీసు ఉన్నవారికి, 12,000 మొత్తంగా గాని, జి.పి.ఎఫ్. మొత్తంలో సగభాగం గాని, మొత్తం మోటార్సైకిల్ రేటు గాని ఏది తక్కువ అయితే అది మంజూరు చేస్తారు..
నోట్: తాత్కాలిక అడ్వాన్సుగాని, పార్టెఫైనల్ గాని ఒక ఆర్ధిక సంవత్సరంలో రెండుసార్లకు మించరాదు మరియు ఒక అడ్వాన్సుకు మరొక అడ్వాన్సుకు మధ్య ఆరు నెలలు వ్యవధి తప్పక ఉండాలి.
బాస్టర్ స్కీం: రూలు 30(ఎ) ప్రకారం జి.పి.ఎఫ్. చందాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో అదనపు ప్రయోజనంగా మరణానికి 3 సం||ల ముందు తన ఖాతాలో గెజిటెడ్ వారికి రూ.8000/- బాలెన్సు, నాన్ గెజిటెడ్ వారికి రూ.6000/-, బాక్టడ్ వారికి రూ.2000/- తప్పక ఉండాలి. అలాంటి వారికి జి.ఓ.ఎం.ఎస్.నెం. 425 ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ, తేది 28-9-1976, జీ.ఓ.ఎం.ఎస్. నెం. ఫై(పెన్షన్) శాఖ, తేదీ 29-1-2003 ప్రకారం సరాసరి నెల విలువకు రెండింతలు మొత్తం రూ.20,000/- మించకుండా వెల్లిస్తారు.
సాధారణ భవిష్యనిధి మంజూరు చేయు అధికారం :- జీ.ఓ.ఎం.ఎస్.నెం. 42 ఫైనాన్స్ (పెన్షన్ -11) శాఖ, తేది 29-1-2003 ప్రకారం
(ఎ) జిల్లా స్థాయి కార్యాలయాలలో : ఎన్జీవోలు అందరికీ డ్రాయింగ్ అధికారి మంజూరు చేయవచ్చును. అయితే డ్రాయింగ్ అధికారి గెజిటెడ్ కానిచో తరువాత ఉన్న గెజిటెడ్ అధికారి మంజూరు చేస్తారు. అయితే ఒకరి కంటే ఎక్కువ గెజిటెడ్ అధికార్లు ఉన్నచో ఆ కార్యాలయపు అధికారి, ఇతర గెజిటెడ్ అధికారులందరికీ మంజూరు చేస్తారు.
బి) ఉపాధ్యాయులకు : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలో పనిచేయు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖాధికారి జి.ఓ.యం. ఎస్. నెం. 40 విద్య తేది 7-5-2002 ప్రకారము ఈ అప్పులను మంజూరు చేసి ట్రెజరీల ద్వారా సదరు సొమ్మును డ్రా చేస్తారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు, మండల పరిషత్ ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి సదరు అప్పులను జి.ఓ.యం.యస్. నెం.447 వ.రా. తేది 28-11-2013 ప్రకారము మంజూరుచేసి, మంజూరు ఉత్తర్వులను ఫారం 40-ఎ తో పాటు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును డ్రా చేసి సంబంధిత ఉపాధ్యాయుల బ్యాంక్ అక్కౌంట్లలో జమ చేయమని కోరతాడు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి వారి దరఖాస్తులపై జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ అప్పులను మంజూరు చేస్తారు.
ఫైనల్ పేమెంట్ (ఖాతా మూసివేత) ఎప్పుడు? ఎలా?
ఉద్యోగి మరణించినను, 7సం॥లు కనిపించకుండా పోయినను అతని లేదా అమె వారసులకు నిల్వయున్న సొమ్మును చెల్లిస్తారు. దీని కొనకు ఫైనల్ విత్ డ్రాయల్కు ఉపయోగించు దరఖాస్తునే ఉపయోగించాలి. డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్తో ధరఖాస్తుతో జతపరచి వారసులు సంతకాలతో నిర్ణీత ఫారములో ప్రతిపాదనలు పంపుకోవాలి.
నామినేషన్ పత్రములో ఎవరినీ వారసులుగా నిర్ణయించని యెడల వివాహం అయితే, భార్య/ భర్త, వివాహం కాని సందర్భములో తల్లిదండ్రులు, మైనర్ తమ్ముడు, పెళ్ళికాని సోదరి, మరణించిన కొడుకు భార్య లేక పిల్లలు తాతయ్యను ప్రాధాన్యతా క్రమంలో కుటుంబ సభ్యులుగా గుర్తించి నిల్వలోయున్న భవిష్యనిధిని చెల్లిస్తారు. (రూల్.29,30)
ముగింపు: పి.యఫ్. చందాదారుడైన ప్రతి ఉద్యోగి నిబంధనలపట్ల అవగాహన కలిగియుండాలి. ఎప్పటికప్పుడు పి.యఫ్. ఖాతాలో చందా, డి.ఎ. అరియర్స్, ఎంట్రీలను కార్యాలయములోని రిజిస్టర్లో సరిచూసుకోవాలి. మిస్సింగ్ క్రెడిట్స్పై తక్షణం దరఖాస్తు చేసుకుంటే అవినీతికి తావుండదు. అయిన దానికి కానిదానికి అప్పు తీసుకోకుండా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అప్పు తీసుకోవాలి. ఈ అప్పు తప్పని సరైన కుటుంబ ఖర్చులను తీర్చగలిగేదిగా ఉండాలి లేక మీ ఆర్ధిక స్థోమత పెంచుటకు ఒక సోపానంలా ఉపయోగపడాలి. ఆవుకు తిన్నది పుష్టి .మనిషికి ఉన్నది పుష్టి అలాగే ఉద్యోగిని ఆర్థికంగా పరిపుష్టి చేసేది సాధారణ భవిష్య నిధే.
0 comments:
Post a Comment