ఈరోజు జరిగిన EHS Steering Committee విషయాలు

 ఈరోజు జరిగిన EHS Steering Committee  విషయాలు


1. Smart Health Cards 4 రోజుల్లో DDO ల ద్వారా Distribute అయ్యేట్లు చర్యలు తీసుకుంటామన్నారు.


2. EHS లో ట్రీట్మెంట్ కు 2లక్షల నుండి 3 లక్షలకు పెంచారు.


3. EHS Package రేటులను పెరిగిన రేటులకనుగుణంగా రివిజన్ చేసారు. అవసరమైతే మరో 10% పెంచేందుకు అంగీకరించారు.


4. APSRTC వారికి కూడా Health Cards ఇచ్చారు. ఎయిడెడ్, మోడల్ స్కూల్ టీచర్స్ కు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే అమలు చేస్తారు.


5. ఇకపై మెడికల్ కాలేజ్ లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్ తో బాటు టెస్టులు కూడా చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఒక జిల్లాలో ట్రయల్ గా నడపి, మిగిలిన జిల్లాలకు అమలు చేస్తారు.


6. ఇకపై మెడికల్ రీయింబర్స్ మెంట్ మంజూరు అయితే Trust నుంచి Message వస్తుంది. అలాగే జూన్ 1 నుండి మంజూరు ఉత్తర్వులు ఆన్ లైన్ ద్వారా తీసుకోవచ్చు.


7. YSR Trust లో మెడికల్ బిల్లుల Status తెలియజేసేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగి తో బాటు మరొక ఉద్యోగిని కూడా కేటాయిస్తారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 18004251818 కు ఫోన్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.


8. కోవిడ్, హాస్పిటల్ రెన్యువల్ వంటి వివిధ కారణాలతో 6నెలలలోపు Online చేయలేకపోయిన మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లు సబ్మిట్ చేయడానికి పర్మిషన్ ప్రత్యేకంగా ఇవ్వాలని కోరాము. పరిశీలిస్తారు.


9. కాలిపోయిన బిల్లులు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే మంజూరు అయ్యేట్లు చూడాలని కోరాము. బిల్సు Xerox కాపీ లను Attest చేయించి సబ్మిట్ చేస్తే మంజూరు చేస్తారు. అలా ఇప్పటికి 42 మంది దరఖాస్తు చేస్తే 27 మందికి చెల్లించామని చెప్పారు.


10. కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ప్రతీ హాస్పిటల్ లో EHS పథకంలో ఉద్యోగుల కోసం కొన్ని Beds ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top