APJAC & APJAC Amaravathi : దసరా కానుకగా PRC ప్రకటించాలి

 తక్షణం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించక పోతే పోరాటం తప్పదు... 

APJAC మరియు APJAC AMARAVATI ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన తేదీ: 12.10.2021

ఎలక్ట్రానిక్ / ప్రింట్ మీడియా లకు ప్రకటన మరియు ప్రచురణార్ధం


 

                           ఈ రోజు అనగా తేది 12.10.2021న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ AP JAC చైర్మన్ బండి శ్రీనివాసరావు, AP JAC అమరావతి చైర్మన్ బొప్పరాజు, AP JAC సెక్రటరీ జనరల్ G. హృదయ రాజు, AP JAC అమరావతి సెక్రటరీ జనరల్ వైవీ రావు తదితరులు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్ని మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ.సమీర్ శర్మ, IAS గార్ని ఇరు JAC ల నాయకత్వం కలిసి ఈ క్రింది సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా AP JAC& AP JAC అమరావతి ఐక్య వేదిక ద్వారా మొదటి మెమొరాండం శ్రీ సజ్జల గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గార్లకు ఇచ్చి "ఇరువురు తక్షణమే చొరవతీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి దసరా కానుకగా PRC ప్రకటించాలని కోరడమైనది. 

ఈ సందర్భంగా గా: సజ్జల రామకృష్ణా రెడ్డి గారు స్పందిస్తూ మీ ప్రధాన సమస్యలపై ఇప్పటికి గౌ: ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో రెండు, మూడు దఫాలుగా చర్చించారని, అవన్నీ చివరి దశలో ఉన్నాయని, ఇరు JAC లు కలిసి వచ్చారు కాబట్టి తక్షణమే ఈ విషయాన్ని గౌ: ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి, ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం. ప్రకటించేవిధంగా చేస్తామని హామీ ఇవ్వడమైనది. 1. ఒకటవ తేదీన ఉద్యోగ ఉపాధ్యాయులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించలేని ఆర్థికశాఖ తీరును తీవ్రంగా గర్తిస్తున్నామని, ముఖ్యంగా పెన్షన్లు సకాలంలో రాక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు. పడుతున్నారని అలాగే వివిధ శాఖల్లో మరియు పోలీసుల శాఖతో సహా, సరెండర్ Leave Encashment డబ్బులతో పాటు, పదవీ విరమణ చేసిన మరియు చేయబోతున్న వారికి రావలసిన ఆర్ధిక పరమైన సౌకర్యాలు అనగా పెన్షన్లు, Gratuity, GPF, APGLI Claims, APGLI Loans, వైద్య ఖర్చులు మరియు దహన సంస్కారాలు ఖర్చులు (మట్టి ఖర్చులు) కూడా గత సంవత్సర కాలంగా రాక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.

             అలాగే గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న రీతిగా ప్రతి నెల మొదట తేదీన విధిగా, పెన్షనర్లకు ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి తగు ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు.

2. పి.ఆర్.సి కమిషన్ నివేదిక ఇచ్చి చాలాకాలం అయినందున ఈ సంవత్సరం దసరా లోపు 11వ పిఆర్పిని ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించాలని కోరారు.

3. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చిన రీతిగా సి.పి.ఎస్ ను రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

4. అలాగే 01-07-2018 నుండి పెండింగ్ లో ఉన్న డి.ఏ లలో రెండు డి.ఏలు అనగా 01-07-2018 మరియు 01-01-2019 డి.ఏ. లను మరియు 01-07-2018 నుండి 01-07-2021 వరకు ఇవ్వవలసిన మిగిలిన ఐదు డి.ఏ లను 31-12-2021 లోగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

5. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోపాభుయీష్టమైన సి.ఎఫ్.ఎం.ఎస్ (CFMS) విధానాన్ని రద్దు చేయాలని కోరారు. 

6. జిల్లా సెలెక్ట్ కమిటీల ద్వారా ROR ప్రకారం ఎంపిక కాబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను "తక్షణమే క్రమబద్ధీకరించాలని అలాగే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు.

7. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని, నెట్ వర్క్ ఆస్పతులను ప్రభుత్వం సరిగా నియంత్రించటం లేకపోవడం వలన ఉద్యోగులు అధిక మొత్తాలు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారని, రీయంబర్స్మెంట్ ద్వారా తక్కువ మొత్తాన్ని పొందుతున్నారని, కావున ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను రద్దుపరచి, ప్రభుత్వం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రభుత్వ అజమాయిషీతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయాలు (Cashless Treatment) కల్పించాలని కోరారు.

8. ప్రస్తుత ధరవరలను బట్టి కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వెంటనే పెంచాలని కోరారు. 

9. కొన్ని ప్రభుత్వ శాఖలలో గల కార్యదర్శులు ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మరియు పురపాలక శాఖ మొదలగు శాఖలలో శాఖపరమైన పదోన్నతులు కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దాని వలన సంవత్సరాల తరబడి పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయని, కావున వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

10. కోవిడ్ వలన మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలని కోరారు. అంతేకాక, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరోనా కష్ట కాలంలో కూడా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై అమలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు నిర్లక్ష్యం చూపిస్తుందనే భావన ప్రతీ ఉద్యోగులలోనూ నెలకొందని, తమ న్యాయ పరమైన . చిన్న చిన్న కోర్కెలను కూడా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా పరిష్కరించడం లేదనే భావన ఉద్యోగ వర్గాలలో నెలకొందని దీనిని పారద్రోలాలని వారు తెలిపారు.

          మా సమస్యలు పరిష్కారం కానియెడల దశల వారీగా పోరాటాలు చేయడానికి రెండు జే.ఏ.సి లు సిద్ధమని వారు ప్రభుత్వానికి తేటతెల్లం చేశారు.

              గౌ: శ్రీ సజ్జల గారిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసిన వారిలో APNGO'S రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.V. శివారెడ్డి, AP JAC అమరావతి రాష్ట్ర కోశాధికారి వి వి మురళీకృష్ణ నాయుడు, రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి ఈశ్వర్, APRSA రాష్ట్ర ఉపాధ్యక్షులు R.V రాజేష్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జయబాబు, శ్రీ రంగారావు, AP NGO'S రాష్ట్ర కార్యదర్శి తదితరులు ఉన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top