కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ

 ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగుల్ని నచ్చ చెప్పేందుకు కమిటీ వేశామని చెబుతోంది చెబుతున్నా..తమ నిర్ణయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేబినెట్ భేటీలో పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేసి.కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్‌ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. 11 వ పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేళ్లతోనే జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సర్కారు ఆదేశించింది.

ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు సర్వీస్‌ గణించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. 25వ తేదీగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. డీడీవోలకు కొత్త పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది.

అయితే ఉద్యోగులు ఎవరూ తాము ఆ పని చేసేందుకు అంగీకరించడం లేదు. తమపై ఒత్తిడి తేవొద్దని అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమానికి తాము కూడా సంఘిభావం తెలుపుతున్నామని.. ట్రెజరీ.. పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతాయా.. లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top