తెలుగు సాహిత్యంలో మనవవాదానికి ఆద్యుడు

 తెలుగునాట హేతువాద ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన వారిలో రామస్వామి ఒకరు.

కవిరాజుగా పేరు పొందిన త్రిపురనేనిని హేతువాదం, మానవవాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు.

త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15 న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగారు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైనారు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించారు. 1911లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కళాశాలలో చేరారు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును, అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించారు.

1914లో న్యాయ శాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లారు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము, ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా అధ్యయనం చేసారు.

రామస్వామి భారతదేశం తిరిగి వచ్చిన తరువాత, పాములపాటి వెంకట కృష్ణయ్య గారి ప్రోద్బలంతో తెనాలి వచ్చారు. కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొలది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవృత్తులను మార్చుకున్నారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలు, మత అరాచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవాలకు నాంది పలికారు. రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో పాల్గొనినారు. రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి మొదలైనవారి ఆదర్శాలను ప్రజలలోనికి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు.

1914లో డబ్లిన్ లో చదువుతున్న రోజుల్లోనే అనీబీసెంట్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసినదిగా భారతీయులకు విజ్ఞాపన చేస్తూ కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశారు. రామస్వామి స్వాతంత్ర్య ఉద్యమ రోజులలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరచే అనేక దేశభక్తి గీతాలు రచించారు.

1917లో భారత దేశానికి తిరిగివచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించారు. కానీ ఆయన ముఖ్య వ్యాసంగము సంఘ సంస్కరణే. స్మృతులు, పురాణాలు, వ్యవస్థీకృత మతము వలన వ్యాపించిన కుల వ్యవస్థ మీద, సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమము ప్రారంభించారు. 1922లో గుంటూరు జిల్లా, తెనాలిలో స్థిరపడ్డారు.1925లో తెనాలి పురపాలక సంఘ అధ్యక్షుడిగా జస్టిస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఉన్నపుడు, గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించారు. ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి తొలగించారు. అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికై, తిరిగి అధ్యక్షుడయ్యారు. జంతుబలులు మాత్రం సాగలేదు. 1938 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు.

1941 లో మానవ వాదం ప్రవక్త ఎం.ఎన్,రాయ్  వీరి గృహం 'సుతాశ్రమం' సందర్శించారు

1898లో పున్నమ్మను పెళ్ళి చేసుకున్నారు.మరో ప్రఖ్యాత రచయిత త్రిపురనేని గోపీచందువీరి కుమారుడే. 1920లో మొదటి భార్య చనిపోగా, చంద్రమతిని పెళ్ళి చేసుకున్నారు. వీరి కుమారుడే గోకుల్ చందు.

రామస్వామి పెద్దకుమారుడు త్రిపురనేని గోపీచందు తెలుగులో ప్రప్రథమ మనస్తత్వ నవల "అసమర్థుని జీవయాత్ర "రాసి తెలుగు సాహిత్యముపై చెరగని ముద్ర వేశారు.

భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. అంతకుముందు 1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో ఆయన పేరు మీద తపాళా బిళ్ళను విడుదలచేయడం జరిగింది. తెలుగు వారిలో తండ్రి, కొడుకులు ఇద్దరికి తపాల బిళ్ళలు విడుదల చేసిన అరుదైన గౌరవం వీరికి దక్కింది.పెద్దకుమార్తె సరోజిని దేవి భారతీయ పాలనా యంత్రాంగపు అధికారి అయిన కానుమిల్లి సుబ్బారావును వివాహమాడినది.

త్రిపురనేని గోకులచందు కూడా తెలుగు సాహితీ రంగమునకు తనదైన రీతిలో తోడ్పడ్డాడు. ఈయన రచనలలో 1950లలో వచ్చిన బెంగాల్ కరువుకు దర్పణము పట్టిన నాటకము విశిష్టమైనది.

రామస్వామి చిన్న కుమార్తెచౌదరాణి స్వాతంత్ర్య ఉద్యమ సమయములో భారతీయ నావికా దళములో తిరుగుబాటుదారైన అట్లూరి పిచ్చేశ్వరరావుని పెళ్ళి చేసుకొన్నది. ఈమె తమిళనాడులో తొలి తెలుగు పుస్తకశాలను ప్రారంభించిన తొలి మహిళ. ఈమె 1996లో చనిపోయింది.

ఈ తరానికి బాగా తెలిసిన, తెలుగు చలనచిత్ర నటుడైన త్రిపురనేని సాయిచంద్ సుప్రసిద్ద రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు, కవిరాజు త్రిపురనేని రామస్వామికి మనుమడు.

త్రిపురనేని రామస్వామి మనసా, వాచా, కర్మణా సంస్కర్తగా మెలిగాడు. తన పేరులో ఉన్న కుల చిహ్నం చౌదరిని తొలగించుకున్న ఆదర్శమూర్తి ఆయన. వారు 1943 జనవరి 16 న మరణించారు.

ఆయన సాహిత్య కృషిని గుర్తించి, ఆంధ్ర మహాసభ ఆయనకు కవిరాజు అనే బిరుదునిచ్చి గౌరవించింది. 1940లో గుడివాడ ప్రజానీకము గజారోహణ సన్మానము చేసారు.శంబుక వధ, ఖూనీ,రాణా ప్రతాప్,కొండవీటి పతనం, వివాహవిధి,పల్నాటి పౌరుషం వంటి రచనలు చేశారు.

1987 వ సంత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శతజయంతి వేడుకలలో భారతదేశ ప్రభుత్వము వారు ఆయన స్మారక చిహ్నముగా ఆయన పేరు మీద తపాళా బిళ్ళను జారీ చేయడం జరిగింది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరి పేరుతో "కవిరాజు త్రిపురనేని రామస్వామి " పురస్కారం ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొలువైన తెలుగు వెలుగులలో వీరి శిలా విగ్రహం ప్రతిష్ఠించారు.

ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాధనముగా త్రిపురనేని ఎంచుకున్నారు. రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించారు. సూతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది.జాగర్లమూడి కుప్పుస్వామి గారి మిత్రత్వంతో 'కుప్పు స్వామి శతకం' 1930లో రాసారు.సంస్కృత భాషలో ఉన్న పెళ్ళి మంత్రాలను తెలుగులోకి అనువదించి, అచ్చులో సరళమైన వివాహ విధి అను పద్ధతిని తయారు చేసాడు. ఈయన స్వయంగా అనేక పెళ్ళిళ్లకు పౌరోహిత్యము వహించి జరిపించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.. మానవసేవే మాధవసేవ అని నమ్మారు.

యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

జనవరి 16 రామస్వామి వర్ధంతి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top