రాత్రి వేళ సైకిల్‌పై మహిళా IPS రమ్య భారతి గస్తీ
అభినందిస్తూ ట్వీట్ చేసిన CM స్టాలిన్
చెన్నైలో రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా IPS అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. IPS 2008 బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి గ్రేటర్ చెన్నై నార్త్ జోన్ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాత్రి చెన్నైలోని ఫ్లవర్ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించి. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితుల్ని విచారించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఈ విషయం తెలియటంతో ట్విటర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment