ప్రతిభ ప్రాతిపదికనే ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు


ప్రతిభ ప్రాతిపదికనే ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు

10 వ తరగతి విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగానే వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యాసంవత్సరానికి సీట్లు కేటాయించనున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆర్జీయూకేటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించింది. ఈసారి పదోతరగతి పరీక్షలు నిర్వహించడంతో యథావిధిగా విశ్వవిద్యాలయం ప్రారంభం నుంచి ఉన్న పద్దతి ప్రకారం ప్రతిభ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పదోతరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన రెండు, మూడురోజుల అనంతరం ట్రిపుల్‌ఐటీలలోని సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ కులపతి. ఆచార్య కేసీరెడ్డి తెలిపారు.

0 comments:

Post a Comment

Top