అమ్మఒడి పథకం పైన HMs కు ఒక అవగాహన:

అమ్మఒడి పథకం పైన HMs కు ఒక  అవగాహన:



అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

జాబితా-2:(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన  Grievance format  లో submit చేయాలి.

జాబితా-3:(Re confirmation/re verification required)  ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి

మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది.

ఇందులో 

1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II &  List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II &  List-III  లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top