ఉపాధ్యాయుల హాజరుకు ప్రత్యేక యాప్ - ఆగస్టు నుండి ప్రారంభం



ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరు నమోదుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ను రూపొందించింది . ఆగస్టులో దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు .

 ఇప్పటివరకు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి యాప్లోనే ముఖకవళికలు ఆధారంగా హాజరు వేయాల్సి ఉంటుంది .

 సెలవులకు దరఖాస్తులూ ఇందులోనే పెట్టేల్సి ఉంటుంది .

 తద్వారా ఉపాధ్యాయుడు ఎన్ని సెలవులు ఉన్నాయి ? ఎన్ని పెట్టారు ? ఏ సమయానికి వస్తున్నారు ? ఎంత ఆలస్యంగా వస్తున్నారు ? అనే వివరాలు మొత్తం రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరనుంది . 

విద్యార్థులు , మధ్యాహ్న భోజనం హాజరూ ఇదే యాప్లో ఉంటుంది .

 విద్యార్థులు హాజరు వేసే సమయంలోనే మధ్యాహ్న భోజనం తినే పిల్లల వివరాలను నమోదు చేయాలి .

 ఉపాధ్యాయుల సెల్ఫోన్లనే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది . 

పాఠశాలకు 50 మీటర్ల దూరం వరకే ఇది పని చేస్తుంది .

 ఉపాధ్యాయుల సమాచారాన్ని ప్రధానోపాధ్యా యులు ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయిన తర్వాత ఈ యాప్ను వాడుకలోకి తీసుకొస్తారు . 

ఇప్పటికే విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారు . దీన్ని యాప్కు లింకు చేస్తారు . పిల్లల వివరాలు మొత్తం యాప్ లో కనిపిస్తాయి .

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top