Scholarships: స్టూడెంట్స్ కోసం స్పెషల్ స్కాలర్‌షిప్స్.. దరఖాస్తు చేసుకోండి

 ఏటా విద్యా ఖర్చులు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితి సహకరించక కోరుకున్న చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు విద్యార్థులకు ఆశాజ్యోతులు. ఇవి ట్యూషన్ ఫీజుల భారాన్ని తగ్గించడం కాకుండా అకడమిక్ ఎక్సలెన్స్, అసాధారణ ప్రతిభకు తగిన గుర్తింపును కూడా అందిస్తాయి. ఇప్పుడు 2023 సెప్టెంబర్- అక్టోబర్‌కి సంబంధించి మూడు ప్రముఖ స్కాలర్‌షిప్, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకుందాం.

1. సక్షం స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డ్రైవర్స్‌ చిల్డ్రెన్‌

మహీంద్రా ఫైనాన్స్‌ ‘సక్షం స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ డ్రైవర్స్‌ చిల్డ్రెన్‌’కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు , కేరళ , తెలంగాణకి చెందిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ తేలికపాటి మోటారు వాహనాలు, ట్యాక్సీలు, జీపులు, కార్లు, డెలివరీ వ్యాన్‌ల వంటి స్మాల్ కమర్షియల్ వెహికల్స్‌కి వ్యాలిడ్‌ డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉన్న డ్రైవర్ల, నిరుపేద, ప్రతిభావంతులైన పిల్లలకు సాయం చేస్తుంది

అర్హత ప్రమాణం

దరఖాస్తుదారులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు అడ్మిషన్‌ పొంది ఉండాలి. విద్యార్థులు తమ మునుపటి ఫైనల్ పరీక్షలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అన్ని సోర్సుల నుంచి దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.4,00,000 మించకూడదు

ప్రైజ్‌లు, రివార్డులు

స్కాలర్‌షిప్‌ సంవత్సరానికి రూ.5,000 నుంచి రూ.20,000 వరకు ఉంటాయి

దరఖాస్తు గడువు

2023 సెప్టెంబర్ 30

* అప్లికేషన్ మోడ్

ఆన్‌లైన్‌లో https://synergieinsights.in/saksham/home/Application ద్వారా అప్లై చేసుకోవచ్చు.

2. ఆస్పైర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24

అజయ్ చౌదరి, అతని కుటుంబం స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ స్వయం ఛారిటబుల్ ట్రస్ట్ ‘ఆస్పైర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24’ని అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ భారతదేశంలోని 11 ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థలలో బీటెక్‌ కోర్సులను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి రూపొందించబడింది.

* అర్హత ప్రమాణం

పేర్కొన్న 11 సంస్థల్లో ఏదైనా ఒకదానిలో BTech కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశించే విద్యార్థులు అర్హులు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని సోర్సుల నుంచి రూ.6 లక్షలకు మించకూడదు.

* ప్రైజ్‌లు, రివార్డులు

స్కాలర్‌షిప్ యాక్చువల్‌ ఫీజ్‌ స్ట్రక్చర్‌ ఆధారంగా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, ఆహారం, సంబంధిత ఖర్చుల సహా విద్యాపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది.

దరఖాస్తు గడువు

2023 సెప్టెంబర్ 10

* అప్లికేషన్ మోడ్

ఆన్‌లైన్‌లో www.b4s.in/it/ASPI1 ద్వారా అప్లై చేసుకోవచ్చు.

3. సెన్సోడైన్ ఐడీఏ షైనింగ్ స్టార్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

గతంలో గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్‌గా ఉన్న HALEON ఇండియా.. ‘సెన్సోడైన్‌ ఐడీఏ షైనింగ్ స్టార్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్’కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారతదేశం అంతటా బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన, వెనుకబడిన విద్యార్థులకు సపోర్ట్‌ చేసే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ రూపొందించారు.

* అర్హత ప్రమాణం

గవర్నమెంట్‌, గవర్నమెంట్‌-ఎయిడెడ్‌ కళాశాల్లో ప్రత్యేకంగా మొదటి సంవత్సరం BDS విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ హయ్యర్ సెకండరీ విద్యలో కనీసం 60% సాధించి ఉండాలి. అభ్యర్థులు తమ 4-సంవత్సరాల కోర్సులో ప్రయోజనాలను పొందుతూ ఉండటానికి ప్రతి సెమిస్టర్/సంవత్సరంలో తప్పనిసరిగా 60% స్కోర్‌ మెయింటైన్‌ చేయాలి. అన్ని సోర్సుల నుంచి దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.8,00,000 మించకూడదు.

* ప్రైజ్‌లు, రివార్డులు

స్కాలర్‌షిప్ 4 సంవత్సరాలకు రూ.4,20,000 (సంవత్సరానికి రూ.1,05,000) అందుతుంది.

* దరఖాస్తు గడువు


2023 అక్టోబర్ 31


* అప్లికేషన్ మోడ్


ఆన్‌లైన్‌లో www.b4s.in/it/SSPPS1 ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top