NEET 2024: నీట్ నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి అంటే ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు

ఇంగ్లీష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/ క్లిక్ చేయండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 1700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ. 1600.

ఎస్సీ,ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని తర్వాత వెల్లడించనున్నారు. నీట్ పరీక్ష మే 5న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంట మధ్య జరగనుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది.


Whatsapp Channel...
Telegram Channel...
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top