ప్రశ్న : ఎల్.ఎఫ్.ఎల్. ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న ఉపాధ్యాయునికి 12 సంల స్కేలు పొందాలంటే ఏఏ అర్హతలు ఉండాలి?
• జవాబు : ఎల్.ఎఫ్.ఎల్. ప్రధానోపాధ్యాయుని 12 సం॥ల స్కేలు అంటే ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని స్నేలు అవుతుంది. అందువలన 12 సంజల స్కేలు పొందాలంటే డిగ్రీ, బిఇడి, డిపార్ట్మెంట్ పరీక్షలు ఉత్తీర్ణులు కావలసి వుంటుంది.
ప్రశ్న : చైల్డ్ కేర్ లీవు ఎన్ని విడతలుగా వాడుకోవచ్చు? అన్ని విడతలలో సమానంగా వాడుకోవాలా?
• జవాబు : చైల్డ్ లీవు గరిష్టంగా 10 విడతలలో వాడుకోవాలి. అన్ని విడతలలో సమానంగా వాడుకోవాలనే నిబంధన ఏదీలేదు.
ప్రశ్న : సస్పెన్షన్ పీరియడిని జీత నష్టపు సెలవుగా ఇస్తూ ఆ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్ కు పరిగణిస్తూ. ఉత్తర్వులు ఇచ్చారు. జీత నష్టపు సెలవు కాలానికి సంపాదిత సెలవు జమ చేస్తారా?
• జవాబు : ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనల ప్రకారం జీత నష్టప సెలవు కాలానికి 1/10వంతు సంపాదిత సెలవు తగ్గింపు చేస్తారు. ఆ కాలాన్ని డ్యూటీ పీరియడా పరిగణించినప్పుడు మాత్రమే మొత్తం సంపాదిత నెలవు జమ చేయబడుతుంది.
ప్రశ్న: మార్చి నెలలో జీతాల బిల్లులో మినహాయించే ఎంప్లాయిస్ వెల్ఫర్ ఫండ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఎంత మినహాయించాలి?
• జవాబు : గెజిటిడ్ అయినా నాన్ గెజిటిడ్ అయినా అందరికీ ఒకే విధంగా రూ.20/-లు ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ క్రింద మినహాయింపు చేయాలి
ప్రశ్న : రాబోవు ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి ఆదాయపు పన్నును డిడిఓ మార్చి నెల నుండి మినహాయింపు చేస్తామంటున్నారు. ఉద్యోగి చివరి మూడు నెలలలో మినహాయించాలని కోరుతున్నారు. ఏది వాస్తవం?
• జవాబు : ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం రాబోవు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను అంచనావేసి మార్చి నెల జీతాల బిల్లునుండే మినహాయింపు చేయవలసి వుంటుంది.
ప్రశ్న : పిఎఫ్ పెంపుదల లేదా తగ్గింపు మార్చి నెల నుండే చేయాలా?
• జవాబు : ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా రెండుసార్లు పెంపు దల చేసుకోవచ్చు. ఒకసారి తగ్గింపు చేసుకో వచ్చు.
గమన
- ఏ కేటగిరిలోనైనా 12 సం||ల స్కేలు (SPP-IA) పొందాలంటే పై ప్రమోషన్ పోస్టుకు చెందిన అర్హతలు కలిగి ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులకు 12 సం॥ల స్కేలు పొందాలంటే తదుపరి ప్రమోషన్ పోస్టు అయిన స్కూల్ అసిస్టెంట్కు కావలసిన డిగ్రీ, బిఇడి తప్పనిసరిగా ఉండాలని ఇంటర్, డిఇడి అర్హతలు ఉంటే 12 సం॥ల స్కేలు రాదని అనేకమంది ఖజానాధికారి అభ్యంతరం తెలియజేయడం జరుగుతోంది.
- అయితే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ జిఓ ఎంఎస్ నం. 11 మరియు 12; తేదీ. 23.01.2009 ప్రకారం సెకండరీగ్రేడ్ టీచర్లకు పదోన్నతి పోస్టు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యా యుని పోస్టు - ఆ పోస్టుకు కావలసిన అర్హతలు ఇంటర్ డిఇడి సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు ఇంటర్ డిఇడి అర్హతతో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి లభిస్తుంది. కాబట్టి సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులందరికి ఎలాంటి అదనపు ప్రత్యేక అర్హతలు లేకుండానే 12 సం||ల స్కేలు, 18 సం||ల ఇంక్రిమెంట్ ఇవ్వ వచ్చని సంఘాలు ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
- సంఘాల ప్రాతినిధ్యం ఫలితంగా పాఠశాల విద్యా కమీషనర్ RC. NO. ESE02-13/47/2024-EST3-CSE, Dt.21.02.2024 ద్వారా డైరక్టర్ ఆప్ ట్రజరీస్ కు లేఖ రాస్తూ సెకండరీగ్రేడ్ ఉపాధ్యాయులు 12 / 18 సం॥ల స్కేలుకు డిఇడి సరిపోతుందని అదనంగా ఎలాంటి టెస్టులు ఉత్తీర్ణత పొందనవసరం లేదని పేర్కొనడం జరిగింది.
- తద్వారా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎలాంటి అదనపు అర్హతలు లేకుండానే 12/18 సం॥ల స్కేలు పొందటానికి ఎలాంటి ఆటంకాలు లేవు.
0 comments:
Post a Comment