Mana Badiki Podam Android App

ManaBadikiPodham App is developed for department of school education,Govt. A.P.

Department  of School Education realizes that teaching fraternity can play a vital role in curtailing drop outs including during the critical transitory stages from Primary School to Upper Primary School and from there to High School.

Teachers will  will make efforts to engage with the child, their parents and keep a constant watch on the child and its family’s plans for the future of the child.
 They have to gather contact numbers of the parents of their assigned students, fill a report every fortnight with qualitative student and family factors observed that may eventually lead to student discontinuing in that school and record them on Mobile App created for the purpose

బడి ఈడు కలిగిన బాలలందరినీ బడిలో చేర్పించడానికి సర్వే ప్రక్రియను సోమవారం నుంచి నిర్వహించనున్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఎస్‌పీడీ కార్యాలయం జారీ చేసిన షెడ్యూలు ప్రకారం జిల్లాలో ఈనెల 22 నుంచి 30 వరకు నిర్వహించేందుకు ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. బడిఈడు కలిగిన బాలలను సర్వే చేయడానికి ‘మన బడికి పోదాం’ అనే పేరు రూపొందించారు. కార్యక్రమ నిర్వహణ కోసం జిల్లా స్థాయి సమావేశాన్ని ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి కాత్యాయనీ ప్రసన్న ఇటీవల నిర్వహించారు. అనంతరం మండల స్థాయి సమావేశాలను నిర్వహించి ఎంఈవోల ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. సదరు కమిటీల సభ్యులు సోమవారం నుంచి ఆయా మండలాల్లో పర్యటించి బడి బయట బాలలను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తారు.

ప్రత్యేక యాప్‌

మన బడికి పోదాం కార్యక్రమ నిర్వహణ కోసం ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ కార్యాలయం వారు ప్రత్యేక యాప్‌ రూపొందించారు. www.spdapssa.org అనే యాప్‌ను మండల కమిటీల ప్రతినిధులు డౌన్‌లోడ్‌ చేసుకుని గుర్తించిన బడి బయట బాలల రోజువారీ వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ‘ఛైల్డ్‌ ఇన్ఫో’ డేటా ప్రకారం జిల్లాలో బడి బయట బాలలు 13,336 మంది ఉన్నట్లు నిర్ధరణ అయింది. వీరిలో 14 సంవత్సరాలలోపు బాలబాలికలతో పాటు 18 సంవత్సరాలలోపు దివ్యాంగ బాలలున్నారు. వీరందరినీ మండలస్థాయి కమిటీల ప్రతినిధులు సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వ బడుల్లో చేర్పించడం మన బడికి పోదాం కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రతి మండల కమిటీలో సీఆర్‌పీలు, ఐఈఆర్‌టీలు, తాత్కాలిక బోధకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డీఎల్‌ఎంటీలు, ఐఈఆర్‌టీలు, పీటీఐలు, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీలు ఉన్నారు. 30 రోజులకు పైబడి పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను సేకరించి వారిని బడిలో చేర్పించాల్సి ఉంటుంది. ఒక్కో మండలస్థాయి కమిటీ రోజుకు ఒక పాఠశాల పరిధిలో సందర్శించి బడి ఈడు బాలలను గుర్తించాలి. ఆ విధంగా గుర్తించిన వారి వివరాలను మన బడికి పోదాం యాప్‌లో ఏ రోజుకారోజు పొందుపరచడంతోపాటు అవే వివరాలను ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది.

నిర్వహణ ఇలా..

▪బడి బయట బాలల సర్వే కోసం రూపొందించిన యాప్‌లో విద్యార్థుల పూర్తి వివరాలను నమోదు చేయాలి

▪అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఎన్‌జీవోల సహకారంతో మండలస్థాయి కమిటీలవారు సర్వే నిర్వహించాలి

▪చైల్డ్‌ఇన్ఫో వివరాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించాలి

▪సర్వే నిర్వహణకు నిర్ణీత ప్రణాళికను మండల విద్యా శాఖాధికారి రూపొందించుకోవాలి

▪స్కూలు కాంప్లెక్సును ప్రాతిపదికగా తీసుకుని ఒక్కో కాంప్లెక్సునకు అవసరమైనంత మంది ఎన్యూమరేటర్లను నియమించాలి

 ▪రోజుకు ఒక పాఠశాల పరిధిలో సర్వే నిర్వహించాలి

▪ ఒక్కో ఎన్యూమరేటర్‌కు 8 నుంచి 10 పాఠశాలల పరిధిలో సర్వే నిర్వహించే విధంగా పాఠశాలలను కేటాయించాలి

 ▪బడి బయట బాలల సర్వే నిర్వహణలో ఏమైనా సందేహాలుంటే 99590 21345 లేదా 94402 18886 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్ఛు

Download Mana Badiki Podam Android app
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top