జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా.....

కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పోయిన ఆదివారం జనతా కర్ఫ్యూ ప్రకటించారు నిన్న అర్ధరాత్రి నుంచి  21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన వేళ తొలి దశ జనాభా లెక్కలు (2021) ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే చాలా రాష్ట్రాలు ఈ కరుణ మహమ్మారిని ఎదుర్కొనటానికి లాక్ డౌన్ దిశగా పని చేస్తున్నాయి అలాగే ఎన్‌పీఆర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదా వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి.

 తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఎన్‌పీఆర్‌ అమలుపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top