ఇంటర్ స్పాట్ వాల్యూషన్ వాయిదా
ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూషన్ వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీంతో *ఈనెల 21 నుంచి ఈనెల 31 వరకు స్పాట్ వాల్యూషన్ ప్రక్రియకు బ్రేక్ పడనుంది.*
స్పాట్ వాయిదా పడిన విషయాన్ని స్పాట్ వాల్యూషన్ కేంద్రంలో అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బందికి అధికారులు సూచించారు. అన్ని సబ్జెక్టుల ఎగ్జామినర్లు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment