కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక స్ప్రేయర్‌ను అభివృద్ధి చేసిన‌ శాస్త్రవేత్తలు

కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక స్ప్రేయర్‌ను అభివృద్ధి చేసిన‌ శాస్త్రవేత్తలు
దుర్గాపూర్‌లోని సిఎస్‌ఐఆర్-సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎమ్‌ఇఆర్‌ఐ) లోని శాస్త్రవేత్తలు రెండు మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక స్ప్రేయర్ యూనిట్లను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్లను వ్యాధికారక సూక్ష్మ జీవిని సమర్థవంతంగానిర్మూలించి ఆ ప్ర‌దేశాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డానికి  ఉపయోగ‌ప‌డ‌తాయి, ముఖ్యంగా ఆసుపత్రులలో.దీనిని బాగా ఉప‌యోగించ‌వ‌చ్చు.
బ్యాటరీ ఆధారిత‌ క్రిమిసంహారక స్ప్రేయర్ (బిపిడిఎస్) , న్యూమాటిక్ ఆపరేటెడ్ మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక (పోమిడ్) అని పిలువబడే ఈ యూనిట్లు టేబుల్స్, డోర్ నాబ్‌లు , లైట్ స్విచ్‌లు, కౌంటర్‌టాప్‌లు, హ్యాండిల్స్, డెస్క్‌లు, ఫోన్లు, కీబోర్డులు, టాయిలెట్‌లు , ఫ్యూసెట్లు, సింక్‌లు , కార్డ్‌బోర్డ్‌లు శుభ్రం చేయ‌డానికి ప‌నికి వ‌స్తుంది. ఈ క్రిమిసంహారక యూనిట్ల ను త‌ర‌చూ శుభ్ర‌ప‌ర‌చ‌డానికి  వాడడం వ‌ల్ల‌ ఆ ఉపరితలాలను  అనుకోకుండా తాక‌డ‌వం వ‌ల్ల  వ్యక్తులకు కరోనావైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
వివ‌ర‌ణ‌:
బిపిడిఎస్‌, పిఒఐఎండి  రెండింటిలోని స్ప్రేయర్ వ్యవస్థలు రెండు-దశల స్ప్రేయింగ్ యూనిట్లు, ప్రత్యేక నిల్వ ట్యాంకులు క‌లిగిఉండేలా  రూపొందించారు, దిగువ , ఎగువ శ్రేణులలో సెట్ చేసిన‌ స్థిర, సౌకర్యవంతమైన నాజిల్‌లల‌ ద్వారా భ‌వ‌నంల‌లోప‌లి ప్రాంతాలనుప మూల మూల‌లా శుభ్రపరచడానికి, క్రిమిసంహారకం చ‌ల్ల‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎక్కువ విస్తీర్ణాన్ని కవర్ చేయడానికి క్రిమిసంహారక స్ప్రేయర్  ఇండ‌స్ట్రియ‌ల్ వేరియంట్ కూడా ఉంది.
పిఒఎంఐడి మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక యూనిట్ నాలుగు చక్రాలపై అమర్చిన స్టీల్ ఫ్రేమ్‌ల ద్వారా తయారు చేయబడింది. ఈ వ్యవస్థలో కంప్రెషర్‌లు, పైపింగ్ , ఫిట్టింగులు, స్ప్రే నాజిల్‌లు ఉంటాయి. చేతితో పట్టుకునే సౌకర్యవంతమైన స్ప్రే చేతిని ఏ దిశలోనైనా అవసరానికి అనుగుణంగా తిప్పుతూ ఉపయోగించవచ్చు. పోమిడ్ యూనిట్‌లో రెండు స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి, ఇవి 10 లీటర్ల సామర్థ్యం క‌లిగిన‌వి. బిపిడిఎస్ యూనిట్ కార్డ్‌లెస్ మెషీన్, ఇది రెండు-నాజిల్ స్ప్రే సిస్టమ్‌ క‌లిగిన‌ది ,అలాగే ఎక్స్‌టెండెడ్ ఆర్మ్ స్ప్రే యూనిట్ కూడా ఉంది. ఇది 20 లీటర్ల నిల్వ సామర్థ్యం , ఒకే ఛార్జీలో 4 గంటల బ్యాటరీ బ్యాకప్ సమయం క‌లిగి ఉంటుంద‌ది.. దీని  బరువు (ఖాళీ ట్యాంక్) 25 కిలోలు.
"మార్కెట్లో ప్రబలంగా ఉన్న క్రిమిసంహారక స్ప్రేయర్లు చాలావరకు ద్రవానికి ఒకే చాంబర్ నిల్వను ఉపయోగించి శుభ్రపరచడం లేదా క్రిమిసంహారక చేయడంపై ఆధారపడి ఉంటాయి . ఇవి పంపు ఆధారిత స్ప్రేయ‌ర్లు. పంప్ స్ప్రేయర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన బిందువులు పరిమాణంలో చాలా పెద్దవి , ఉపరితలం  ప్రభావవంతమైన కవరేజ్ తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ,సిఎస్ఐఆర్ -సిఎంఇఆర్ ఐ అభివృద్ధి చేసిన ఇండోర్ స్ప్రేయర్ వ్యవస్థలు క్రిమిసంహారకాలు శుభ్రపరచడం కోసం డ్యూయల్-ఛాంబర్ నిల్వను కలిగి ఉంటాయి , మంచి నాజిల్ డిజైన్, నాజిల్  మంచి అమరిక, తక్కువ బిందు పరిమాణాలను కలిగి ఉంటాయి. స్ప్రే చేసిన క్రిమిసంహారక ద్రవం  నిర్దిష్ట పరిమాణానికి ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ”అని సిఎస్ ఐఆర్-సిఎంఇఆర్ ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ హరీష్ హిరానీ అన్నారు.

స్ప్రే చేసిన క్రిమిసంహారక  ప్రభావాన్ని నిర్ణయించడంలో కణ పరిమాణం ,క్రిమిసంహారకమందు కణాల సంఖ్య రెండూ ముఖ్యమైన ప్ర‌మాణాలు గా ఉంటాయి. కోవిడ్ -19 వ్యాప్తిని  అరిక‌ట్ట‌డానికి సమర్థవంతమైన,  సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై సిఎస్ఐఆర్- సిఎంఇఆర్ఐ గట్టి దృష్టి సారించింది. పరికరాల అభివృద్ధి , తదుపరి దశ క్రిమిసంహారక మందులు , శుభ్రపరిచే స్ప్రేల ను అన్ని ర‌కాలుగా అనువైన వాటిని పూర్తి స్థాయిలో త‌యారు చేయ‌నున్నారు అలాగే పాఠశాలలు, గృహాలలో వాడటానికి ఇది కాంపాక్ట్ గా  ఉంటుంది ”అని ప్రొఫెసర్ హిరానీ తెలిపారు.
ఈ స్ప్రేయర్‌లు మూల‌మూల‌ల‌కు చేరుకోవడానికి , సమగ్రంగా శుభ్రం చేయడానికి మోపింగ్ లక్షణాలు , అన్నివైపులా విస్తరించదగిన ప‌రిక‌రాల‌ను కలిగి ఉంటాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతకోవిడ్ -19 సంక్షోభం త‌ర్వాత‌ కూడా ఔచిత్యం కలిగి ఉంటుంది, ఎందుకంటే వైరస్‌లు అంతటా ఉన్నాయి , ప్రతి సంవత్సరం అటువంటి ఇన్ఫ్లుఎంజా కేసులు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి. అందువల్ల, పరిశుభ్రత , ఆరోగ్య సంరక్షణ పరికరాల భవిష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని ఎంఎస్‌ఎంఇలు ముందుకు వచ్చి ఈ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులు పెట్టాలని డాక్టర్ హిరానీ కోరారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

APSCERT Abhayasa Spoken English Course DD Saptagiri 10th Class Live ClassesSubscribe My Whatsapp & Telegram Groups Promotion Lists Software More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top