కందిపప్పు సరఫరా సూచనలు
ఈవారంలో ప్రతి పాఠశాలకు డ్రై రేషన్ లో భాగంగా కందిపప్పు సరఫరా చేయడం జరుగుతుంది.
1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 4.5kg మరియు 6నుండి 10తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 6.5kg.. ప్రకారం ప్యాకెట్ రూపంలో ఇవ్వబడుతుంది.
ప్రధానోపాధ్యాయులు స్టాక్ తీసుకున్న తర్వాత,సరిచూసుకొని సప్లైయర్ కు సప్లై సర్టిఫికెట్ ఇవ్వవలెను.
తీసుకున్న స్టాక్ వివరాలను మరియు స్టాక్ ఫోటోను IMMS యాప్ లో Dal Receipt అనే ఆప్షన్ నందు అప్లోడ్ చేయాలి.మరియు MDM స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయాలి.
ఆ తర్వాత విద్యార్థుల పేరెంట్స్ కు Dall పంపిణీ చేసి అక్విటేన్స్ తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో PC చైర్మన్/సర్పంచ్ లను భాగస్వామ్యం చేయవలెను.
పంపిణీ కార్యక్రమ విషయాన్ని వార్తా పత్రికలలో ప్రచురణ అయ్యేటట్లు చొరవ చూపాలి.
పంపిణీ పూర్తి అయిన తర్వాత ఎంతమంది విద్యార్థులకు పంపిణీ చేశారో ఆ వివరాలను కూడా IMMS యాప్ లో Dry Ration ఆప్షన్ నందు అప్లోడ్ చేయాలి.
పంపిణీ పారదర్శకంగా జరగాలి.ఎటువంటి ఆరోపణలు రాకూడదు.
సప్లై సర్టిఫికెట్.. ఒక కాపీని స్కూల్ లో భద్రపరచవలెను మరియు ఒక కాపీని MRC కి పంపవలెను.మరోకటి సప్లైయిర్ కు ఇవ్వాలి.
1.2.21,ఆ తర్వాత అడ్మిషన్ పొందిన విద్యార్థులకు డ్రై రేషన్(కంది పప్పు)రాదు.
డ్రై రేషన్.. 1.9.20 నుండి 31.1.21 మధ్య కాలానికి(100 పని దినాలు)ఇవ్వడం జరిగింది....



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment