PDF MLC పి.డి.ఎఫ్. ప్రాతినిధ్యాలు - 26/10/2021.

పి.డి.ఎఫ్ తరఫున 26/10/2021వ తేదీన సెక్రటేరియట్ నందు అందుబాటులో ఉన్న అధికారులతో కొన్ని సమస్యలపై ప్రాతినిధ్యాలు చేసాము. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి ఎస్.పి.డి. అందుబాటులో లేరు.

  1. ఉపాధ్యాయుల అంతర జిల్లా బదిలీలపై విద్యాశాఖ అసిస్టెంట్ సెక్రటరీ స్వర్ణలతతో చర్చించడం జరిగింది. 194 స్పాస్, 354 పరస్పర మొత్తం 548 మంది బదిలీల ప్రతిపాదనలు విద్యాశాఖకు పంపించారు. అయితే స్పాస్ కేసులకు సంబంధించి ప్రాఫార్మాలో సంబంధిత కాలంలో వేకెన్సీలు ఉన్నవా ? లేదా అనే చోట ఒక్కొక్క   ఒక్కొక్క రకంగా పేర్కొన్నారని, కావున వేకెన్సీలకు సంబంధించిన సమాచారం కమీషనర్ నుండి రప్పించుకుంటామని స్వర్ణలత కమీషనర్ నుండి 13 జిల్లాలలో స్పాస్ బదిలీలకు నేరెన్సీల పరిస్థితి వెంటనే రప్పించాలని చెప్పాము. అదివచ్చిన వెంటనే జి.ఎ.డి. అనుమతికి పంపిస్తామన్నారు. 
  2. ఉన్నత విద్య ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సతీష్ చంద్రతో ఎయిడెడ్ అధ్యాపకుల విలీనంతో డిస్టర్డ్ కాబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒప్పంద అధ్యాపకులను స్వంత జోనులలో సర్దుబాటు చేయుటకు వీలులేని 73 మందికి ఇతర జోనులలో సర్దుబాటు చేయాలని కోరగా అందరినీ ఆవిధంగా సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు. 
  3. రాజమండ్రి యస్.కె.వి.టి. కళాశాల ప్రభుత్వంతో విలీన నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశాము.  
  4. వైయన్ కాలేజ్ నరసాపురం, యస్. కెబి ఆర్ కాలేజ్ అమలాపురం, యం.యస్.ఎన్. చారిటీస్ కాకినాడ, ఎ.ఎఫ్.డి.టి. మలికిపురం, మహారాణి కాలేజ్ పెద్దాపురం ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరికొన్ని కళాశాలలు ప్రభుత్వంలో విలీనానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాము. మేనేజ్ మెంట్ సమ్మతి తెలియజేస్తే, విలీనం చేస్తామన్నారు. 
  5. మేనేజ్ మెంట్ అంగీకారం తెలియజేయకపోతే ఆ కేంద్రాలలో తక్షణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పాము
  6. అన్ ఎయిడెడ్ పోస్టులలో పనిచేస్తున్న అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని గట్టిగా చెప్పాము. ఆవిధమైన ప్రోవిజన్ చెప్పుకొచ్చారు.
  7. పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేదితో జిల్లా పరిషత్ పాఠశాలలలో ఉన్న నాన్ టీచింగ్ సిబ్బందిని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలకు సమానంగా సర్దుబాటు చేయాలని, కొన్ని పాఠశాలలలో ఒక్కరూ లేరని తెలియజేశాము. ఎయిడెడ్ పాఠశాలల నుండి విలీనం కాబడుతున్న నాన్ టీచింగ్ సిబ్బందిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు కేటాయించాలని లేఖ ఇచ్చాము. కార్యదర్శి అందుబాటులో లేనందున పేషీలో లేఖ ఇచ్చాము.
  8. సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మితో చర్చించిన విషయాలు. పాలిటెక్నిక్ కాలేజ్ అధ్యాపకుల బదిలీల ఫైల్ సి.యం.ఒ. కార్యాలయానికి వెళ్ళిందని చెప్పారు.
  9. పాలిటెక్నిక్ అధ్యాపకులకు ఎ.ఐ.సి.టి.ఇ. వేతన సవరణ ఫైల్ క్యాబినెట్ ఆమోదం కోసం సి.యం.వి. కు పంపడం పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనం 35వేల నుండి 40,270రూ.లకు పెంపుదల ఫైల్ ఆర్థిక శాఖకు పంపించామని చెప్పారు. ఐ.టి.ఐ, డిప్లొమాంతర ఉన్నత అర్హతల ప్రవేశానికి అవకాశం కల్పించమని కోరారు.
  10. ఐ.టి.ఐ. కేంద్రాలకు విద్యుత్ బిల్లులు లక్షలలో బకాయిలు ఉన్నాయని విడుదల చేయాలని చెప్పగా ఆర్థిక శాఖ విడుదల చేయడం లేదన్నారు. ఐ.టి.ఐ. లలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరగా, వీరిని రెన్యువల్ చేయడం కోసమే ఆర్థిక శాఖఅనుమతి కష్టంగా ఉన్నదని, రెగ్యులరైజేషన్ ప్రభుత్వ నిర్ణయం అన్నారు. 
  11. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ తో TW సి.ఆర్.టి. లకు రెన్యువల్ ఉత్తర్వులు ఇప్పించాలని; జి.వి.యస్. ఎ.పి.జి.ఎల్.ఐ. పి.ఎఫ్.. మెడికల్ బిల్లులకు, యస్.యస్.ఎ. నిర్మాణ బిల్లులకు క్లియరెన్స్ ఇప్పించాలని,2003 2002 పండిట్లకు పాత పెన్షన్ వర్తింప చేయాలని
  12. 2002 డియసీ హిందీ పండిట్స్ శ్రీకాకుళం జిల్లాలో నియామకమైన 39 నుందికి ఆర్థిక శాఖ అనుమతి
  13. కోవిడ్ కాలంలో చనిపోయిన వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖలలో చనిపోయిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ఉద్యోగులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని లేదా రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించిన విధంగా చెల్లించాలని, 
  14.  కోవిడ్ సోకిన వారికి 20 రోజుల స్పెషల్ లీప్ వర్తింప చేయాలని 
  15.  అర్బన్ మీ సేవా కేంద్రాలలో గత 16 ఏళ్ళుగా పనిచేసిన ఉద్యోగులను, కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశాము.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top