YSR HEALTH CARE TRUST వారు విడుదల చేసిన EHS AP APP డౌన్లోడ్ చేసుకోండి

YSR HEALTH CARE TRUST వారు విడుదల చేసిన EHS AP APP డౌన్లోడ్ చేసుకోండి 

వైయస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు  ఉద్యోగులకు, పెన్షనర్స్ కు ఉపయోగపడేలా ఆండ్రాయిడ్ యాప్ ను విడుదల చేశారు

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు._ 

పై యాప్ పై క్లిక్ చేసి EHS AP  YSR Health care trust ను ముందుగా మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. 

తర్వాత  యాప్ ఓపెన్ పై చేస్తే ఎంప్లాయి హెల్త్ స్కీమ్ పేజి ఓపన్ అవుంది.   

OTO/ Password option లో

హెచ్ ఎస్ లో ఇంతకు పూర్వమే పాస్వర్డ్ పెట్టుకున్నవారు పాస్వర్డ్ ఆప్షన్,   మిగిలిన వారు ఓటిపి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 

ఓటిపి ఆప్షన్  ఎంచుకున్నావారికి వారి రిజిష్టర్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది. దానిని Password దగ్గర ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి.

డిజిటల్ కార్డులు ఉన్నవారు అయితే  తమ కార్డు పైన ఉన్న  బార్ కోడ్  స్కాన్ చేస్తే  అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

డిజిటల్ కార్డులు  లేనివారు ఉద్యోగులైతే తమ ట్రెజరీ ఐడి / సి ఎఫ్ ఎం ఎస్ నెంబర్ /  పెన్షనర్స్ అయితే వారి  పి పి ఓ ఐ డి/ EHS ఐ డి   ఎంటర్ చేసి  లాగిన్ పై  క్లిక్ చేయాలి.  

ఓపెన్ అయిన హెచ్ ఎస్  సైట్ నందు మన ఫోటో మన అడ్రస్ కనిపిస్తాయి.

అక్కడ ఉన్న  త్రీ డాట్  పై క్లిక్ చేసి చూస్తే మన ఫ్యామిలీ హెల్త్ వివరాలు కనిపిస్తాయి.

ఈ సైట్ లో మనం  ఈ హెచ్ ఎస్ కార్డ్  తెలుసుకోవచ్చు, పరిశీలించు కోవచ్చును.

కేస్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే  మనం ఇప్పటివరకు పొందిన మన కేసు వివరాలు అన్నీ కనిపిస్తాయి.

హాస్పిటల్ సెర్చ్ 

ఈ సైట్ లో ముఖ్యంగా ఉపయోగపడేది.  దీనిపై క్లిక్ చేసి state /district  / Speciality సెలక్షన్ ద్వారా మనకు మన రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక  రాష్ట్రాలలో  ఈ హెచ్ ఎస్ పరిధిలో ఉన్న  హాస్పిటల్స్ లిస్ట్, స్పెషలైజేషన్  మరియు వాటిని చేరుకోవడానికి డైరెక్షన్స్ ను చూడగలుగుతాం.

మెడికల్ రీ ఎంబర్స్ మెంట్  పై క్లిక్ చేసి మనం ఆఫ్లైన్/  ఆన్లైన్ లలో సబ్మిట్ చేసిన మన ఫైల్స్ యొక్క పరిస్థితిని పరిశీలించవచ్చు.

స్కీం కవరేజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఈ హెచ్ ఎస్ పరిధిలో హెచ్ ఎస్ నిర్వహణ, హాస్పిటల్స్, రూల్స్, వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పూర్తి వివరాలను మనం చూడడానికి అనువుగా ఇందులో చేర్చారు.

Download Android App

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top