ఆంధ్రప్రదేశ్లో 6 రకాల పాఠశాలలు వాటి వివరాలు

 209 పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించటం జరిగింది. అవి: 1. ఫౌండేషన్ పాఠశాలలు 2. ఉన్నత పాఠశాలు.

210 ఫౌండేషన్ పాఠశాలలు:

పూర్వ ప్రాథమిక విద్య పిపి-1, పిపి-2 మరియు 1,2 తరగతులకు ఫౌండేషన్ పాఠశాలలుగా గుర్తించడం జరిగింది. అయితే ఆయా స్థానిక పరిస్థితులు, పాఠశాలలు అందుబాటు, పాఠశాలలకు వెళ్ళుటలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ పాఠశాలలను 3 రకాలుగా విభజించడం జరిగింది.

1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ : ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలో పిపి-1, పిపి-2 తరగతులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో 3 నుండి 4 సం||ల వయస్సు గల పిల్లలు విద్యనభ్యసిస్తారు.

2. ఫౌండేషన్ పాఠశాలలు : ఈ పాఠశాలల్లో పిపి-1, పిపి-2, 1, 2 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల ఉండి 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలపడానికి వీలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3 నుండి 8 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

3. ఫౌండేషన్ స్కూల్ ప్లస్ : ఈ పాఠశాలల్లో పిపి-1, పిపి-2, 1, 2, 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉండి సమీపంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులను కలుపుటకు సాధ్యం కాని ఆవాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 3 నుండి 10 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు

211 ఉన్నత పాఠశాలలు:

1. ప్రి-హైస్కూల్స్ : ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 7 లేదా 8వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 సం॥ నుండి 13 లేదా 14 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

2. హై స్కూల్స్ : ఈ పాఠశాలలు 3 నుండి 10వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 15 సం॥ల పిల్లలు విద్యనభ్యసిస్తారు.

3. హై స్కూల్ ప్లస్ : ఈ పాఠశాలల్లో 3 నుండి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో అవసరం ఉన్నచోట 11, 12 తరగతులను కలిపి వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 17సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top