3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలలో కలుస్తున్న నేపథ్యంలో కావలసిన అదనపు తరగతి గదులను నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు..

3,4,5  తరగతులు ఉన్నత పాఠశాలలో కలుస్తున్న నేపథ్యంలో కావలసిన అదనపు తరగతి గదులను నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు..

ఈ ఫార్మేట్ లో 32 కోలమ్స్ ఇవ్వబడ్డాయి

1 నుంచి 6 కోలమ్స్ సాధారణ సమాచారం.

 7వ గడిలో యాజమాన్యం అనగా ZP/MPP.. GOVT.. GOVT TW.. AP RESIDENTIAL ఇలా

8వ గడిలో పాఠశాల కేటగిరీ అనగా ప్రైమరీ.. UP.. సెకండరీ

 9 నుంచి 13 గడులలో తరగతుల వారి ఎన్రోంట్ 14వ గడిలో మొత్తం ఎన్రోల్మెంట్ వెయ్యాలి. ( తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలను కలిపి మొత్తం తరగతి ఎన్రరోలెంట్ గా చూపాలి)

15వ గడి నుంచి 23వ గడులను రెండు భాగాలుగా విభజించారు

15వ గడిలో 6వ గడిలో పేర్కొన్న పాఠశాలకు అసలు 2 కిలోమీటర్ల పరిధిలోని వున్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4&5 తరగతులు కలుస్తున్నాయా లేదా YES/NO తెలియజేయాలి.

16 నుంచి 18 గడుల్లో 1 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతుల పాఠశాలల సమాచారం వెయ్యాలి.

19 నుంచి 21 గడుల్లో 1 నుంచి 2 కిలోమీటరు లోపు వున్న 3,4&5 తరగతుల పాఠశాలల సమాచారం నింపవలె.

22వ గడిలో 6వ గడిలో పేర్కొన్న ఉన్నత పాఠశాలకు రెండు కిలో మీటర్ల లోపు మొత్తం ఎన్ని 3,4&5 తరగతుల పాఠశాలలు కలుస్తున్నాయో ఆ సంఖ్య వెయ్యాలి. అంటే 

16 మరియు 19 గడులో ఉన్న సమాచారం ప్రాప్తికి..

అదేవిధంగా 18వ గడి మరియు 21వ గడుల్లో వున్న

పిల్లల సంఖ్యను కలిపి మొత్తం పిల్లల సంఖ్యను 23వ గడిలో వెయ్యాలి

24వ గడిలో 14వ గడిలో వున్న సంఖ్య 23వ గడిలో వున్న సంఖ్య మొత్తం కలిపి వెయ్యాలి.

25వ గడిలో ప్రస్తుతం 6వ గడిలో పేర్కొన్న ఉన్నత పాఠశాలలో బోధనకు ఉన్న గదుల సంఖ్య (ఇక్కడ రిపైర్స్ లో వున్నవి కూడా రూపరచాలి)తా 

26వ గడిలో సదరు ఉన్నత పాఠశాలలో వున్న ఇతర గదులు అనగా HM, STAFF, LIB, LAB మొదలగు గదుల సంఖ్య వెయ్యాలి.

27వ గడిలో 25వ గడిలో సంఖ్య మరియు 26వ గడిలో సంఖ్య కలిపి వాస్తవంగా ఆ పాఠశాలలో వున్న మొత్తం గదుల సంఖ్యగా వెయ్యాలి.

 28 గడిలో ఒక తరగతికి 40 మంది పిల్లలు చొప్పున సదదు ఉన్నత పాఠశాలలో కలుస్తున్న 3,4&5 తరగతుల సెక్షన్ల సంఖ్య వెయ్యాలి అంటే ఉదాహరణకు

 3వ తరగతి లో 50 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు

4వ తరగతి లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు

5వ తరగతి లో 40 మంది పిల్లలు వుంటే 1 సెక్షన్ అంటే మొత్తం 6 సెక్షన్లుగా చూపాలి.

(ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే

3 నుంచి 10 తరగతులకు ప్రతి తరగతికి ఒక గది ఖచ్చితంగా ఉండాలి అక్కడ పిల్లల సంఖ్య 10 లోపు వున్నా సరే)

29వ గడిలో ఒక సెక్షన్ కి సగటు సంక్త్ వెయ్యాలి అనగా 24వ గడిలో వున్న సంఖ్య ను 28వ గడిలో వేసిన సంఖ్య చేత భాగించిగా వచ్చిన సంఖ్యను వెయ్యాలి..

30వ గడి అత్యంత ప్రాధాన్యత గల గడి ఈ గడిలో తరగతివారీ ఎన్రోల్మేంట్ ను పరిగణనలోకి తీసుకుని మీరు | exercise చేసి బోధన నిమిత్తం ఎన్ని గదులు అర్హత వున్నాయి వాటితోబాటు

ప్రధానోపాధ్యాయులకు-1

సిబ్బందికి-1/ఇరవై మంది సిబ్బంది దాటితే 2

లైబ్రరరీ కి 1,

ల్యాట్స్ కి 2,

• కంప్యూటర్-1 (ఉంటే మాత్రమే.. ఊహించి మాత్రం వద్దు)


గేమ్స్ మరియు ఇతరములకు 1

ఇలా 7 లేదా 8 గదులు, ఇవి తరగతి గదులు అనగా తరగతులకు 10 గదులు కావలసుంటే అవి ఇతర గదులు 7. కలిపి మొత్తం 17 గదుల సంఖ్య ను ఆ పాఠశాలకు అర్హత వున్న గదుల సంఖ్య గా 30వ గడిలో చూపాలి.

31వ గడిలో 30వ గడిలో చూపిన అర్హత వున్న గదుల సంఖ్య నుంచి 27వ గదిలో ఆ పాఠశాలలో వాస్తవంగా అందుబాటులో వున్న గదుల సంఖ్య ను తీసివేసి ఆ సంఖ్య ను 31వ గడిలో వెయ్యాలి.

32వ గడిలో ఇప్పుడు 31వ గడిలో ప్రతిపాదించిన గదులకు ఖాళీ స్థలం కాని పాత భవనం పై ఒక గది కట్టుటకు లేదా కొత్తగా G+2 నిర్మాణాలకు స్థలం వుంటే YES అని ఏరకంగాను ఏమాత్రం గదులు నిర్మించడానికి బాగా లేకపోతే NO అని వెయ్యాలి.

ఒక తరగతిని రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెక్షన్లుగా విభజించి ఆ ప్రాప్తికి గదుల ప్రతిపాదన చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు ( తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాలను కలిపి మొత్తం తరగతి ఎర్రరోల్మేంట్ గా చూపాలి )

1 నుంచి 50-1 గది

51 నుంచి 100-2 గదులు

101 నుంచి 140-3 గదులు

141 o 180-4-గదులు

181 220-5 గదులు

221 260-6 గదులు

261 నుంచి 300- 7 గదులు

301 నుంచి 340-8 గదులు.

341 నుంచి 380-9 గదులు

381 నుంచి 420-10 గదులు.

421 నుంచి 460- 11 గదులు

461 నుంచి 500-12 గదులు

50-1 నుంచి 540-13 గదులు..

541నుంచి 580-14 గదులు

581నుంచి 620-15 గదులు

 .ఈ యావత్ అభ్యాసం జిల్లాలో వున్న ఉన్నత పాఠశాలలకు 2 కిలోమీటర్ల పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలల ను దృష్టిలో వుంచుకుని నాడు-నేడు రెండవ దశలో అదనపు తరగతి గదులు కేటాయించడం కోసం చేసే ప్రతిపాదనలు. కాబట్టి మండలంలో వున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు నాడు నేడు మొదటి దశతో సంబంధంలేకుండా ఈ అభ్యాసం చెయ్యాలి. ఒకవేళ 3, 4 5 తరగతులు సదరు ఉన్నత పాఠశాలలో కలవకపోయినా కూడా ఆ పాఠశాలలో వున్న తరగతి వారి సంఖ్య మరియు అక్కడ వున్న గదుల సంఖ్య దృష్ట్యా అవసరమైతే అదనపు తరగతి గదులు కేటాయించవచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top