7వ పే కమిషన్ సిఫార్సులో ఫిట్మెంట్32% అయితే అసలు 14.29% ఫిట్మెంట్ మతలబు ఏమిటి ?

కేంద్రంలో 6వ పేకమిషన్ కనీస వేతనాన్ని రూ.7000/-గా 01.01.2006న నిర్ణయించింది. 7వ పేకమిషన్ - మూడు వినియోగ యూనిట్లు (Consumption Units) గల కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని సదరు కుటుంబ అవసరాలు ఆహారం, - దుస్తులు, వైద్యం, వసతి మొదలగువాటిని - దృష్టిలో ఉంచుకుని 01.01.2016 నాటికి రూ. 18,000/- కనీస వేతనంగా నిర్ణయించారు. ఈ రూ. 18,000/- కనీస వేతనం 01.01.2006 నాటి కనీస వేతనం రూ.7000/-లకు 2.57 రెట్లు (18000 7000 = 2.57...) ఉంటుంది. అంటే 01.01.2006న కనీస వేతనం రూ.100/-లు అనుకుంటే 01.01.2016 కనీస వేతనం రూ.257/ -లు అవుతుందన్నమాట. ఇంకోవిధంగా చెప్పాలంటే 6వ పేకమిషన్ ప్రకారం ప్రతి రూ.1/-కి 7వ పేకమిషన్ సిఫారసుల ప్రకారం రూ.2.57/-లు అవుతుంది. 01.01.2016 నాటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 125% డి.ఏ.ని. మూలవేతనం లో విలీనం చేస్తే రూ.100/-లు మూలవేతనం (100+125) రూ.225/-లు అవుతుంది. అంటే ఇది రూ. 100/-లకు 2.25 రెట్లు. 2.57 గుణకంలో 2.25 అనేది మూలవేతనంలో 01.01.2016 నాటి 125% డి.ఏ.ను విలీనం చేయగా వస్తుంది. 2.57కు మరియు 2.25 కు తేడా (0.32) వాస్తవ పెరుగుదల (Real Increase) అవుతుంది. ఈ 0.32 వాస్తవ పెరుగుదల 2.25పై 14.2% అవుతుంది. (0.32+2.25 = 1.1422...) ఈ 14.22% 7వ పే కమిషన్ నివేదిక 4.2.9 పేరాలో 14.29%గా పొరపాటుగా ప్రింట్ అయ్యింది. (అయినప్పటికీ ఈ 14.22%ను ఇకపై 14.29%గానే మేము సూచిస్తాము) మూలవేతనం రూ.100/-లు అనుకుంటే 7వ పేకమిషన్లో వేతన నిర్ణయం రూ.257/- (100x2.57=257) అవుతుంది. ఈ 257లో రూ.100 మూలవేతనం + రూ.125 డి.ఏ. మొత్తం 225లు పోగా మిగిలిన రూ.32లు ఫిట్మెంట్ - అనగా ఫిట్మెంట్ 32% అని చెప్పవలసి ఉంటుంది. 32% అనేది మూలవేతనంపై పెరుగుదల. కాగా, 14.29% అనేది మూలవేతనంలో డి.ఏ. కలిసిన మొత్తం పైన వాస్తవ పెరుగుదల (Real Increase అవుతుంది. ఫిట్మెంట్ను మూలవేతనంపై లెక్కిస్తారు గాని, మూలవేతనానికి డి.ఏ. కలిపిన మొత్తంపై లెక్కించటం జరుగదు. 7వ పే కమిషన్ వేతన నిర్ణయానికి ఫిట్మెంట్గా 32% తీసుకోవటం జరిగింది (100+125+32=257) కాని 14.29 (100+125 + 14.29=239. 29) కాదు అనేది స్పష్టం. కాని కార్యదర్శుల కమిటీ, ఆ కమిటీ చెప్పినదాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వాస్తవాన్ని మరుగుపరచి 7వ పేకమిషన్ సిఫారసు చేసిన 14.29% (వాస్తవానికి 14.22%) మాత్రమే ఫిట్మెంట్ ఇస్తామని పదేపదే చెప్పటం జరుగుతోంది. కార్యదర్శుల కమిటీ లేదా రాష్ట్ర ప్రభుత్వం 7వ పే కమిషన్ను ఆధారంగా లేదా ఆదర్శంగా తీసుకోదలిస్తే ఫిట్మెంట్ను 32%గా చెప్పాల్సి ఉంటుంది. కాని 14.29% కాదు అన్నది స్పష్టం అవుతుందికదా! కాని రాష్ట్ర ప్రభుత్వం, దాని కార్యదర్శుల కమిటీ 14.29% ఫిట్మెంట్తో 7వ పే కమిషన్ పేరు చెప్పి 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను, పెన్షనర్లను పక్కదారి పట్టిస్తోంది. అంతే కాక 7వ పే కమిషన్ 01.01.2016న ఆనాటి పరిస్థితులకనుగుణంగా వేతనం నిర్ణయం చేస్తే ఆంధ్రప్రదేశ్లోని కార్యదర్శుల కమిటీ - 01.07.2018 నాటి పరిస్థితులకనుగుణంగా వేతన నిర్ణయం చేయకుండా 01.01.2016 నాటి పరిస్థితులకనుగుణంగా 01.07.2018 నుండి వేతనం నిర్ణయం చేయాలనుకుంటున్నది. ఈ చర్య సారాంశమేమంటే 'ఫిట్మెంట్'ను మూలవేతనంపైన శాతంగా ఇవ్వాలి కాని, మూలవేతనంలో డి.ఏ.ను కలపగా వచ్చిన మొత్తంపై శాతంగా ఇవ్వకూడదు. ఆ విధంగా చూపినపుడు 7వ పేకమిషన్ సిఫారసు చేసిన ఫిట్మెంటు 32% గాని 14.29% కానేకాదు.

ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - 7వ పేకమిషన్ సిఫారసులు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనీస వేతనం రూ.18,000/- నిర్ణయం అశాస్త్రీయమైనదని, ILO సిఫారసులకనుగుణంగా కాని, డా॥ ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా కాని లేదని, కనీస వేతనం రూ.18,000/- కు బదులుగా రూ.26,000/-లు ఉండాలని, ఆ ప్రకారం మూలవేతనాన్ని గుణించే గుణకం 2.57కు బదులుగా 3.714 ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 5 సం.లుగా డిమాండ్ చేస్తున్నారు. వేతన సవరణను 10 సం.ల కొకసారి కాకుండా ఏ.పి.లో జరుగుతున్న విధంగా 5 సం.ల కొకసారి చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక దేశ ఆర్ధిక వ్యవస్థ (Economy) పెరుగుతున్న క్రమంలో సదరు పెరుగుదలననుసరించి (5వ పేకమిషన్ నిర్ణయించిన విధంగా) ఉద్యోగుల జీతభత్యాల నిర్ణయం జరగాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్ధిష్ట కాలంలో పెరిగిన పరిమాణాన్ని (Size) బట్టి చూసినట్లయితే 01.01.2016 న కనీస వేతనం రూ.27,000/-గా నిర్ణయించవలసి ఉందని కూడా కేంద్రప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top