ఈరోజు నుండి జిల్లాలను విభజిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల నుండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా వారు కోరుకున్న జిల్లాలకు బదిలీలు చేపడతారు ఆ బదిలీలు ఎలా చేపడతారు అనేది ఈ కింద వివరించడం జరిగింది. ఇది కేవలం ఉపాధ్యాయుల అవగాహన కొరకు మాత్రమే పూర్తి అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది
జిల్లాల విభజన నేపథ్యంలో ఉపాధ్యాయులు Option ఇచ్చే విధానం ఇలా ఉంటుంది....
ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలుగా విభజించబడింది.ప్రతి జిల్లాలో ఉన్న పాఠశాలలకు/ రోలు కు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను విభజించి ఏ జిల్లాకు ఆ జిల్లా కేడర్ స్ట్రెంగ్త్ రూపొందిస్తారు.
అప్పుడు ప్రతి జిల్లాకు ఎన్ని గజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు మరియు ఇతర ఉపాధ్యాయ పోస్ట్ లు కావాలో నిర్ణయిస్తారు.
ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు option form పూర్తి చెయ్యాలి.
కాకినాడ, రాజమండ్రి, అమలాపురం లలో ఏ జిల్లాకు ఆప్షన్ ఇచ్చుకుంటారో 1,2,3 గా preference ఇవ్వాలి.అప్పుడు మన సీనియారిటీని బట్టి మనం ఎంచుకున్న మొదటి ఆప్షన్ వస్తే ఆ జిల్లా కేటాయించబడుతుంది. ఒకవేళ మన సీనియారిటీకి మనం మొదటిగా ఇచ్చుకున్న జిల్లా రాకపోతే అప్పుడు రెండవ జిల్లా...ఆపై మూడవ జిల్లా ఇస్తారు.
ఒకవేళ కాకినాడ జిల్లాకు 1000 మంది ఉపాధ్యాయులు అవసరం అయిఉండి 800 మంది మాత్రమే option ఇచ్చుకుంటే అప్పుడు కావలసిన 200 మంది ఉమ్మడి జిల్లా సీనియారిటీని బట్టి రివర్స్ సీనియారిటీలో కంపల్సరీగా బదిలీ చేయబడతారు.
ఉదాహరణకు కాకినాడ జిల్లాలోకల్ గా చెందిన ఉపాధ్యాయుడు కాకినాడ జిల్లానే మొదటి ఆప్షన్ గా ఇచ్చుకుని మరియు అతనికి కాకినాడ జిల్లా కేటాయించబడితే ఆ ఉపాధ్యాయుడు పాఠశాల మారడు. అదే పాఠశాలలో పనిచేస్తాడు. ( ఎనిమిది సంవత్సరాలు నిండినా సరే మారడు. బదీలీలు ఇచ్చినపుడు మాత్రం మారాల్సివస్తుంది)
ఏ ఉపాధ్యాయుడికైనా తన మొదటి option జిల్లా రాకపోతే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు స్థానం మారాల్సి వస్తుంది.
ఈ విధంగా మొదట ఉపాధ్యాయులను ఆయా జిల్లాలకు సర్దుబాటు చేసినతరువాత అప్పుడు ఆయా జిల్లాలలోని మండలాలను కోరుకోవడానికి option ఇచ్చుకోవాలి.
0 comments:
Post a Comment