Private Schools 25% Free Seats Admission into Private Schools Notification

Private Schools 25% Free Seats Admission into Private Schools Notification Online Admissions:


Private Schools 25% Free Seats Admission into Private Schools Notification 

ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (C) అనుసరించి 2022-23 విద్యా సంవత్సరం నుంచి  రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశాలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన వారు (అనగా అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు) కోసం 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం మరియు బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు 1వ తరగతి విద్యార్థుల నమోదులో 25% సీట్లు కేటాయించి ఫీజు రీయింబర్సుమెంట్ పద్ధతిన 2022-23 విద్యా సంవత్సరానికి 1 వ తరగతిలో ప్రవేశం కల్పించడం. జరుగుతుంది.

ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ. 1,20,000/- గాను, పట్టణ ప్రాంతంలో నివసించే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు వార్షికాదాయం రూ.1,40,000/- గాను ప్రాతిపదికగా తీసుకొని వారి కుటుంబాల పిల్లలకు ఆర్హులుగా నిర్ణయించడమైనది.

దీనికి సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి గానూ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 లో 12 (1)(C) అమలులో భాగంగా G.O. Ms.No.20, తేది. 03.03.2011 ఉత్తర్వులను సవరిస్తూ G.O.Ms.No.129,తేది.15.07.2022 న సవరణ నోటిఫికేషన్ జారీ చేయడమైనది.

ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కు చట్టం, 2009 లో 12 (1) (C) ను అమలు చేయడానికి ప్రభుత్వం వారు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతి విద్యార్థుల నమోదులో 25% సీట్లు కేటాయించి ఫీజ రీయింబర్స్మెంట్ పద్ధతిన అడ్మిషన్స్ అందించే విధానంలో భాగంగా విద్యార్థులకు ఫీజు నిర్ణయించబడుతుంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సదరు ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009లో 12 (1)(C) అమలు సంబంధించి ఆన్లైన్ లో 16.08.2022 నుంచి 26.08.2022 వరకు దరఖాస్తు చేయుటకు పాఠశాల విద్యాశాఖ వారు http://cse.ap.gov.in వెబ్సైటులో పొందుపరచడం జరిగింది.

1వ తరగతిలో ప్రవేశము కొరకు దరఖాస్తు నమోదు చేయుట కొరకు సంబంధించిన వివరములన్నియు అనగా అర్హత, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ, ప్రవేశ ప్రక్రియకు సంబంధిచిన నియమ నిబంధనలు వంటి వివరాలు మరియు విద్యాహక్కు చట్టం 2009, ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం-2009, G.O.Ms.No.129,తేది. 15.07.2022న సవరణ నోటిఫికేషన్, ప్రామాణిక కార్యాచరణ విధానాలు (Sop) వంటివి http://cse.ap.gov.in వెబ్సైటులో పొందుపరచడమైనది.

విద్యార్థుల ప్రవేశాలకు షెడ్యూల్ :

సవరణ ప్రచురణ విడుదల:04.08.2022

ప్రవేశ ప్రచురణ విడుదల: 10.08.2022

ఆన్లైన్ పోర్టల్ అందుబాటు తేది: 16.08.2022

దరఖాస్తు చేసుకొనుటకు  (ఆన్లైన్ పోర్టల్ లో) తేదీలు: 16.08.22 నుండి 26.08.22

లాటరీ పద్ధతిలో ఎంపిక (మొదటి జాబితా) : 30.08.22

మొదటి ఎంపిక జాబితా విడుదల: 02.09.22

విద్యార్థుల ప్రవేశాలు: 02.09.2022 నుండి 09.09.2022

వరకు(రెండో జాబితాలో ఎంపిక మిగిలిపోయిన సీట్లలోని నిర్ణయించడం జరుగుతుంది)

Download 2nd Lottery Results



Online Application Link

STANDARD OPERATING PROCEDURES (SOP)/ Guidelines for IMPLEMENTATION OF SECTION 12 (1) (C) OF THE RTE ACT, 2009 2022-2023Model Guidelines for Effective Implementation

User Manual Download


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top