CM Jagan Review : సీఎం జగన్ కీలక నిర్ణయం, అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

 అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తి చేయాలని ఆదేశించారు.మహిళా శిశు సంక్షేమంపై సీఎం జగన్ సమీక్ష 

మహిళా శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అంగన్‌వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 61 సీడీపీఓ పోస్టు నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టలన్నారు. సీడీపీఓ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని జగన్ ఆదేశించారు. వాటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అంగన్‌వాడీలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, పిల్లలు వికాసం చెందేలా మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top