RDT Cet దరఖాస్తుల ఆహ్వానం
మే 4 నుంచి 10 వరకు అవకాశం
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరె క్టర్ జి.మోహన్ మురళి తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యా ర్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ జూని యర్ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ ఆర్డీటీ భరిస్తుందని, మే 4 నుంచి 10లోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వివరించారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మే 19న నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 08554-271353, 271354 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు...
Note: ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అనంతపురం జిల్లా వాసులు మాత్రమే అర్హులు
0 comments:
Post a Comment