ఎన్నికల సిరాను తయారు చేసేది మన హైదరాబాదే..

 వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగుచుక్క అంటాడో కవి. ఎన్నికల్లో మన ఓటు ఎంత ముఖ్యమో చెప్పడమే ఇక్కడ కవి ఉద్దేశం. అయితే, ఓటు మాత్రమే కాదు ఎన్నికల్లో సిరా చుక్కది కూడా కీలక పాత్రే.మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, భారత్‌‎తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. అలాంటి సిరాని మన హైదరబాద్ లోను తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధన 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పెడ్తారు. ఈ సిరా చుక్క వేసే పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. దీనిని భారత ఎన్నికల సంఘం పోలింగ్‌ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. ఎన్నికల సమయంలో వాడే సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తోంది. భారత్‎లో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అదే కంపెనీ నుంచి సిరా పంపిణీ చేసేవారు.

అయితే ఈ సిరాని 1990 నుంచి హైదరబాద్‎లోనూ తయారు చేస్తున్నారు. ఉప్పల్‎లోని రాయుడు లాబరెటీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. మైసూర్ పేయింట్స్ అండ్ వార్సిష్ కంపెనీతో పోలిస్తే.. ఇది చిన్న సంస్థే అయినా.. దాదాపు 100 దేశాలుకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది రాయుడు ల్యాబరెటీస్ సంస్థ. ఆయా దేశాల్లో ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు ఇండెలబుల్ ఇంక్‎ను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిథులు తెలిపుతున్నారు. భారత్‎తో పాటు.. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియా, మాల్దీవులు, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు తమ వినియోగదారులుగా ఉన్నారని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.


ఇక ప్రస్తుతం భారత్‌‎లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారు. గత 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలబుల్ ఇంక్‌‎ను తయారు చేస్తోంది. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లు. 2004 తర్వాత ఇంక్ మార్కర్‌‎లను తీసుకొచ్చామన్నారు. ఎలక్షన్స్ పోలింగ్ రోజుకు నెలరోజుల మందే.. ఎన్నికల కమీషన్‎కి మొత్తం ఇంక్‎ని సరఫరా చేస్తామన్నారు. దీంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమంలో వాడే సిరాని కూడా రాయుడు ల్యాబరెటీస్ ఏ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇండెలబుల్ ఇంక్ కోసం ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా.. హైదబరాద్‎లో తయారు అయిన సిరానే ఉపయోగిస్తుండటం మరో విశేషం.

ఇక ఈ ఇంక్‎లో వాడె సిల్వర్‌ నైట్రేట్‌ పర్సెంటెజ్‎ని బట్టి చెరిగిపోయే టైం ఉంటుంది. ఈ సిరాని 5 ML, 10 ML, 25ML, 50ML, 60ML,100 ML పరిమాణంలో ఉండే బాటిల్స్ రెడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈసీకి 5 ML బాటిల్స్‎ని సరఫరా చేశారు. ఒక బాటిల్ 300 మందికి సరిపోతోందంటున్నారు. ఇటీవల బిహార్ పంచాయతీ ఎలక్షన్స్‎లో సిరాకి బదులు మార్కర్స్ ఆర్డర్స్ వచ్చినట్లు రాయుడు ల్యాబెరీటస్ తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థలో 25 మంది వరకు పనిచేస్తున్నారు. ఏడాదికి దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు సంస్థ టర్నోవర్ ఉంటున్నట్లు సమాచారం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top