కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల కార్యక్రమం ప్రారంభం

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల కార్యక్రమం ప్రారంభం

కోటిన్నర మంది పాడి రైతులకు ప్రయోజనం
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా రెండు నెలల్లో ప్రత్యేక కార్యక్రమం

దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి సంఘాలు, సంస్థలకు చెందిన దాదాపు కోటిన్నర మంది పాడి రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను (కేసీసీ) జారీ చేస్తోంది. రెండు నెలల్లో (జూన్‌ 1 నుంచి జులై 31 వరకు) ప్రత్యేక కార్యక్రమంలా దీనిని చేపడతారు. ఆర్థిక సేవల విభాగంతో కలిసి పశు సంవర్ధక విభాగం కేసీసీకి సంబంధించిన సర్క్యులర్‌ను ఇప్పటికే జారీ చేసింది. అన్ని రాష్ట్రాల పాల ఉత్పత్తి ఫెడరేషన్లు, సంఘాలకు దరఖాస్తు నమూనా పంపింది.

     పాడి సహకార ఉద్యమం కింద,    దేశవ్యాప్తంగా 230 పాల ఉత్పత్తి సంఘాల్లో కోటీ 70 లక్షల మంది రైతులు ఉన్నారు.

    పాల ఉత్పత్తి సహకార సంఘాలు, వివిధ యూనియన్లలో సభ్యులుగా ఉండి కేసీసీ లేని రైతులను గుర్తించి, వారందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలన్నది కార్యక్రమం తొలిదశ లక్ష్యం. భూ యాజమాన్యం ఆధారంగా ఇప్పటికే కేసీసీ పొందిన రైతులకు పరపతి పరిధిని పెంచుతారు. అయితే వడ్డీ మాఫీ వెసులుబాటు మాత్రం రూ.3 లక్షల వరకే వర్తిస్తుంది. రైతుల నుంచి ఎలాంటి భరోసా తీసుకోకుండా జారీ చేసే సాధారణ కేసీసీల పరపతి పరిధి రూ.1.6 లక్షలుగానే ఉంటుంది. ఇతర మధ్యవర్తులు లేకుండా రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్ల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా పాల యూనియన్లే రైతుల నుంచి పాలను సేకరిస్తుంటే, ఆ రైతుల నుంచి ఎలాంటి భరోసా తీసుకోకుండా జారీ చేసే కేసీసీ పరపతి పరిధి రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఇది, బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించేలా భరోసా ఇవ్వడంతోపాటు, పాల యూనియన్లలో సభ్యులైన రైతులకు మరింత రుణ మొత్తాలను అందుబాటులోకి తెస్తుంది.

    రైతుల కోసం తీసుకొచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో భాగంగా కోటిన్నర మంది పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్టులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతారు. కేసీసీ పథకం కిందకు కొత్తగా రెండున్నర కోట్ల మంది పాడి రైతులను తీసుకురాబోతున్నట్లు మే 15న ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇటీవలి ఆర్థిక మందగమనం కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల చేతుల్లోకి, ఈ కార్యక్రమం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను తెస్తుంది.

    దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పాడి పరిశ్రమ ఒకటి. గత ఐదేళ్లలో ఏటా 6 శాతానికి పైగా రేటుతో వృద్ధి చెందుతోంది. పెట్టుబడులు, మార్కెటింగ్‌ వంటి అవసరాలు తీర్చుకునేందుకు రైతులకు అందించే స్వల్పకాలిక రుణాలు ఉత్పాదకతను ఊహించని వేగంతో పెంచుతాయి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top