30 సంవత్సరాల సర్వీసు - ఇంక్రిమెంట్ పై కొంత వివరణ.30 సంవత్సరాల సర్వీసు - ఇంక్రిమెంట్ పై కొంత వివరణ.

GO No.1 Dt.17/1/2022 అనుసరించి PRC-2022 అమలు లోకి వచ్చింది. ఈ జివో లోని రూల్ No. 10 ప్రకారంగా AAS 6/12/18 Scales ను గతంలో వలనే యధావిధిగా కొనసాగిస్తూ ఒకే కేడర్ లో 24 సంవత్సరాల సర్వీసుకు ఉన్న SPP-II స్కేలు ను SPP-IIA గాను మరియుఅదే కేడర్ లో 30 సంవత్సరాల సర్వీసుకు SPP-IIB గాను ఇస్తూ PRC అమలు తేది 1/7/2018 నుండి అమలు చేస్తూ ఉత్తర్వులను పొందు పరచారు. AAS పై నగదు చెల్లింపులు మాత్రం 1/2022 నుండి మాత్రమే చెల్లించబడుతుందని రూల్ No. 10.6 లో సూచించారు. అంటే 1/7/18 దాటిన తరువాత ఒకే కేడర్ లో 30సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి మాత్రమే SPP-IIB వర్తిస్తుంది. 30/6/18 కి ముందు 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి వర్తించదనేది సుస్పష్టం.

1/7/2018 నాటికి సర్వీసులో ఉండి ఆతేదికి గానీ ఆ తదుపరి గాని ఒకే కేడర్ లో 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారికి 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిన తేదీకి 24 సంవత్సరాల స్కేల్ లో SPP-IIB మంజూరు చేసి ఆర్ధికలాభం జనవరి2022 నుండి మాత్రమే చెల్లిస్తారు.

Posted in: , , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top