ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన 'అమ్మఒడి' పిల్లలకు వర్తించాలంటే తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలను బడికి పంపించాలని స్పష్టం చేశారు.గతకొన్ని రోజులుగా అమ్మఒడి విషయంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవం, పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు.
విజయనగరంలో నేడు ఏర్పాటు చేసిన అమృత్ పథకంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.."పిల్లలను సక్రమంగా స్కూల్కి పంపితే అమ్మఒడి పథకం కచ్చితంగా వర్తిస్తుంది. అమృత్ పథకంలో భాగంగా ఈరోజు రూ.1,90కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ప్రారంభించాం. విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కలెక్షన్ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఇంటర్ ఫలితాలలో 2019 కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చాయి. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నాం. ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉన్నవారికి వర్తిస్తుంది. అంటే తల్లిదండ్రులు మీ పిల్లలను 75శాతం హాజరు అయ్యేలా ప్రతిరోజు బడికి పంపించాలి. అప్పుడే మీ పిల్లలకు అమ్మఒడి వర్తిస్తుంది. ఇకనుంచి ప్రతి తల్లిదండ్రులు ఇలా చేయండి" అని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment