We Love Reading Summer Activities @ 15.05.24

 బతకాలంటే పారిపో - హాస్య నీతి కథ

     ఒక కలుగులో ఒక ఎలుక వుండేది. ఆ ఎలుకకు ఒక చిన్నపిల్ల వుండేది. ఆ పిల్లకు కలుగులోంచి బైటకు పోయి అడవంతా తిరిగి రావాలని ఒకటే కోరిక. కానీ వాళ్ళ అమ్మ బైటికి పంపేది కాదు.

       *నీవు ఇంకా చిన్న పిల్లవు. ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలియదు. ఆపదలు ఎదురైనప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాక పోదువులే అని చెప్పేది.* 

ఒక రోజు ఎలుకపిల్ల వాళ్ళ అమ్మ ఆహారం తేవడానికి బైటకు పోగానే ఎవరికీ చెప్పకుండా తాను కూడా బైటకు పోయింది.

అడవిలో వుండే రంగు రంగుల పూలు, పచ్చని మొక్కలూ చూసి సంబరంగా ఎగరి గంతులు వేయసాగింది. అంతలో ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద ఈ ఎలుక పిల్లను చూసింది. దానికి నోటిలో సర్రున నీళ్లు ఊరినాయి. ఆహా దొరికిందిరా కమ్మని విందు భోజనం అనుకుంటా ... ఆ ఎలుకను పట్టుకోవడానికని పైనుంచి దూసుకొచ్చింది.

గద్దను చూసిన ఎలుకపిల్ల అదిరిపడింది. ఓరినాయనోయ్... దీనికి గనుక దొరికినానంటే ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోతాయి అనుకుంది. ఆ గద్ద నుంచి  తప్పించు కోవడానికి చించుకోని ఉరకసాగింది. అలా ఉరుకుతావుంటే దానికి ఒక చెట్టుకింద ఒక చిన్న కన్నం కనబడింది. వెంటనే అది సర్రున దానిలోకి దూరి దాచి పెట్టుకొంది. గద్ద ఆ కన్నంలోకి దూరలేక అక్కడే ఆకాశంలో కాసేపు తిరిగి వెళ్ళిపోయింది.

ఎలుకపిల్ల హమ్మయ్య... ఆపద నుంచి తప్పించుకున్నాను అనుకొంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా బైటికి రాసాగింది. అంతలో దానికి వెనుకనుంచి బుస్సుమనే చప్పుడు వినబడింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూసింది. ఇంకేముంది నోరు తెరుచుకున్న పెద్ద నాగుబాము కనబడింది.

“అరెరే... నేను దూరింది పాము కన్నంలోనా" అని అదిరిపడి వెనక్కి తిరిగి మరలా ఉరకసాగింది. దానిని పట్టుకోడానికి పాము వెంటబడింది.

ఎలుకపిల్ల ఉరుక్కుంటా పోతావుంటే దానికి ఒక జొన్న చేను కనబడింది. వెంటనే లోపలికి పోయి ఒక జొన్నచెట్టు వెనుక దాచిపెట్టుకొంది.

పాము ఆ ఎలుకపిల్ల కోసం వెతికి వెతికీ అది కనబడక అక్కడినుంచి వెళ్ళిపోయింది.

పాము నుంచి తప్పించుకున్న ఎలుకపిల్ల 'హమ్మయ్య' అనుకుంటూ చుట్టూ చూసింది. దానికి ఒక జొన్నచెట్టుకు మంచి కంకి కనబడింది. దానిని తెంచుకోని హాయిగా తినసాగింది.

అంతలో ఆ పొలం రైతు ఆ ఎలుకపిల్లను చూశాడు.

“దొంగసచ్చిందానా... నా పంటను నాశనం చేయడానికి వచ్చినట్టున్నావే" అంటూ కర్ర తీసుకోని దానిని కొట్టడానికి వచ్చాడు.

అంతే ఆ ఎలుకపిల్ల అదిరిపడి జొన్న కంకి అక్కడే పారేసి మరలా ఉరకడం మొదలు పెట్టింది.

అలా ఉరుకుతా... ఉరుకుతా... పోతావుంటే దానికి ఒక ఇల్లు కనబడింది. సర్రున పోయి ఆ ఇంటిలో దూరింది. రైతు ఎలుకపిల్ల ఎక్కడా కనబడకపోవడంతో తిరిగి వెళ్ళిపోయాడు...

ఇంటిలో డబ్బాల చాటున దాచిపెట్టుకున్న ఎలుకపిల్ల కాసేపటికి నెమ్మదిగా బైటి కొచ్చింది. ఇంటిముందు పెద్ద తోట ఉంది. ఆ తోటలో సంబరంగా తిరుగుతా వుంటే మియావు అన్న అరుపు వినబడింది. తలెత్తి చూసింది. ఇంకేముంది ఎదురుగా ఒక పెద్ద పిల్లి.

అంతే... ఆదిరిపడి మళ్ళీ ఇంటిలోకి ఉరికింది. ఇదేందిరా ఈ లోకంలో ఎక్కడికి పోయినా ఆపదలు వెంటబడి టారుముతా ఉన్నాయి అనుకుంది.

అలా ఉరుకుతావుంటే దానికి ఒకచోట ఒక ఇనుప బుట్ట కనబడింది. సర్రున దానిలోకి దూరింది. అంతే దాని మూత దభీమని పడిపోయింది. పిల్లి ఆ ఇనుప బుట్టలోపల ఉన్న ఎలుకపిల్లను ఏమీ చేయలేక కాసేపు దాని చుట్టే తిరిగి వెళ్ళిపోయింది.

పిల్లి వెళ్ళిపోగానే ఎలుకపిల్ల ఆ ఇనుప బుట్ట నుండి బైటకు రావాలనుకొంది. కానీ దాని తలుపు తెరుచుకోలేదు. అప్పుడు ఆ ఎలుకపిల్లకు తాను ఇరుక్కున్నది ఎలుకల బోనులో అని తెలిసిపోయింది. పెన్నం మీదనుంచి పొయ్యిలో పడటం అంటే ఇదేనేమో అనుకుంది. అంతలో ఆ ఇంటిలో ఉన్న చిన్న పాప అక్కడికి వచ్చింది.

బోనులో వున్న ఎలుకను చూసి “నాన్నా..నాన్నా..ఎలుకపిల్ల బోనులో పడింది" అని గట్టిగా అరుచుకుంటా పోయి వాళ్ళ నాన్నకు చెప్పింది.

ఎలుకపిల్లకు ఏం చేయాలో తెలియలేదు. ఆ పాప నాన్న గనుక వచ్చాడంటే చంపడం ఖాయం. ఏం చేయాలా అని ఆలోచించ సాగింది. అంతలో దానికి ఒక ఉపాయం తోచింది.

వెంటనే ఊపిరి బిగపట్టి వెల్లకిల్లా అచ్చం చచ్చిపోయినదాని మాదిరి పడిపోయింది. అతను వచ్చి చూశాడు. “అరెరే... చచ్చిపోయిందే" అనుకోని తోక పట్టుకొని బోనులోంచి  తీసి విసిరి దిబ్బలో పడేశాడు.

అంతే... అలా పారేసిన వెంటనే ఆ ఎలుక ఒక్క నిమిషంగూడా ఆగకుండా రాకెట్టు లెక్క సర్రున దూసుకొని పోయి వాళ్ళింటికి చేరుకొంది. 

“చిన్న పిల్లలు ఒంటరిగా బైటకి పోతే ఎన్ని ఆపదలు ఎదురవుతాయి. ఇంకెప్పుడూ అమ్మ తోడు లేకుండా అస్సలు బైటికి పోగూడదు" అను

English GrammarMathematics ActivitiesPosted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top