Base Line Test | ప్రారంభపరిక్ష నిర్వహణ సూచన

 గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారు అన్ని ప్రభుత్వ యాజమాన్యం లోని పాఠశాలలలో 2 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుచున్న విద్యార్ధులకు తేది 22.07.2022 నుండి 26.07.2022 వరకు బేస్ లైన్ అస్సెస్స్మెంట్ నిర్వహించవలసిందిగా ఆదేశించడం జరిగింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎ పి మోడల్ స్కూల్స్, కె.జి.బి.వి, ఎ పి రెసిడెన్షియల్, వెల్ఫేర్ స్కూల్స్ మరియు ఎయిడెడ్ పాఠశాలలలో బేస్ లైన్ అస్సెస్స్మెంట్ తప్పనిసరిగా నిర్వహించి, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి, మార్కులను సంబంధిత రిజిస్టర్ నందు నమోదు చేయడంతో పాటు, స్టూడెంట్ ఇన్ఫో సైట్ నందు నమోదు చేయవలసిందిగా ఆదేశించడమైనది. గౌరవ కమిషనర్ గారు మరియు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వారు జారీ చేసిన సూచనలను కుణ్ణంగా అవగాహన చేసుకుని పరీక్షలను నిర్వహించాలి. వాటితో పాటు దిగువ పేర్కొన్న సూచనలను అందరు మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు పాటించాలని కొరడమైనది.



1. బేస్ లైన్ అస్సెస్స్మెంట్ ప్రశ్నా పత్రాలను ప్రథమ్ ఫౌండేషన్ వారు రూపొందించి అందించడం జరిగింది. 

2. 2వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుచున్న విధ్యార్థులకు ఈ అస్సెస్స్మెంట్ నిర్వహించాలి.

3. అన్ని తరగతుల విద్యార్ధులకు మౌఖిక పరీక్షకు ఒకే రకమైన ప్రశ్నా పత్రాలు ఇవ్వబడతాయి.

4. వ్రాత పరీక్షకు 2-5 తరగతుల విద్యార్థులకు ఒక రకమైన ప్రశ్నా పత్రాలు, 6-10 తరగతుల విద్యార్ధులకు వేరొక రకమైన ప్రశ్నా పత్రాలు ఇవ్వబడతాయి.

5. ప్రశ్నా పత్రాలు తేది 20.07.2022న అన్ని మండల కేంద్రాలకు చేర్చబడతాయి.

6. తేది 21.07.2022 న మండలంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేదా వారి ఆధీకృత పాఠశాల సిబ్బందికి సి ఆర్ పి ల సహకారంతో అందించాలి.

7. బేస్ లైన్ అస్సెస్స్మెంట్ రెండు స్టేజ్ లలో నిర్వహించాలి. అవి 1. మౌఖిక పరీక్ష 2. వ్రాత పరీక్ష

8. మౌఖిక పరీక్షలో 4వ మరియు 5 వ స్థాయిలలో ఉన్న విద్యార్ధులకు మాత్రమే వ్రాత పరీక్ష నిర్వహించాలి. 

9. 2-5 తరగతుల విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లిష్ లలో మాత్రమే వ్రాత పరీక్ష నిర్వహించాలి. గణితం నందు మాత్రం చతుర్విధప్రక్రియలు చేయగలిగిన విద్యార్ధులందరూ వ్రాత పరీక్ష వ్రాసినట్లు పరిగణించాలి.

10. 6-10 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం లలో వ్రాత పరీక్ష నిర్వహించాలి.

11. పాఠశాలలో ఉన్న విధ్యార్థుల సంఖ్యను అనుసరించి తేది 22.07.2022 నుండి తేది 26.07.2022 మధ్య బేస్ లైన్ అస్సెస్స్మెంట్ నిర్వహించాలి.

12. విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే తేది 22.07.2022 న తెలుగు మౌఖిక పరీక్ష, తేది 23.07.2022 న ఇంగ్లిష్ మౌఖిక పరీక్ష తేది 25.07.2022న గణితం మౌఖిక పరీక్ష, తేది 26.07.2022 వ్రాత పరీక్ష నిర్వహించాలి.

13. ఓరల్ అస్సెస్స్మెంట్ నిర్వహించే సమయంలో మరియు వ్రాత పరీక్ష జరిగే సమయంలో విడివిడిగా విద్యార్ధుల స్థాయిలను నమోదు చేయాలి.

14. వ్రాత పరీక్ష జరిపే సందర్భంలో విద్యార్ధులను పరీక్ష హాలు నందు వరుస క్రమంలో కూర్చో బెట్టి మొదటి విద్యార్ధికి శాంపిల్ 1 ప్రశ్నా పత్రం, రెండవ విద్యార్థికి శాంపిల్ 2 ప్రశ్నా పత్రం క్రమంలో అంటే మొదటి పదిమంది విద్యార్థులకు వరుస క్రమంలో పది శాంపిల్స్ ఇవ్వాలి. పదకొండవ విద్యార్థికి మరలా శాంపిల్ 1 ప్రశ్నా పత్రం ఇవాలి. 

15. పరీక్ష ముగిసిన వెంటనే జవాబు పత్రాలను సంబంధిత సబ్జెక్టు ఉపాద్యాయులతో మూల్యాంకనం చేయించాలి.

16. మార్కులను రిజిస్టర్స్ నందు నమోదు చేయడంతో పాటు, సి. ఎస్. సి సైట్ నందు కూడా నమోదు చేయించాలి. 

17. జావాబు పత్రాలను ఉన్నతాధికారుల పరిశీలన నిమిత్తం పాఠశాలలోనే భద్ర పరచాలి. ఎక్కడికి పంపవలసిన అవసరం లేదు.

18. విద్యార్థుల స్థాయిలను గుర్తించిన తరువాత స్కూల్ రెమెడియల్ టీచింగ్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు తెలియజేయబడతాయి.

19. రెమెడియల్ టీచింగ్ పూర్తైయ్యే నాటికి ప్రతి విద్యార్ధి ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమెరసి పొందేటట్లు ఉపాధ్యాయులు కృషిచేయాలి.

20. దిగువ పేర్కొన్న వివిధ రకాల పరీక్షా పత్రాలు ప్రతి మండల కేంద్రానికి అందించబడతాయి. మండల విద్యాశాఖాధికారులు వాటిని అన్ని ప్రభుత్వ యాజమాన్య మరియు ఎయిడెడ్ పాఠశాలల వారికి సి ఆర్ పి ల సహకారంతో అందించాలి.

> టీచర్స్ ఇంస్ట్రక్షన్ మాన్యువల్ (4 పేజీలు) - ( ఒక్కొక్క పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉంటే అన్నీ కాపీలు) (2-10 తరగతుల ఉపాద్యాయులందరికి)

> ఓరల్ టెస్ట్ తెలుగు పేపర్స్ ( రెండు శాంపిల్స్ - ఒక్కొక్క శాంపిల్ రెండు పేజీలు - మొత్తం 4 పేజీలు) - ( ఒక్కొక్కపాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉంటే అన్నీ కాపీలు)(2-10 తరగతుల ఉపాధ్యాయులందరికి) > ఓరల్ టెస్ట్ ఇంగ్లిష్ పేపర్స్ ( రెండు శాంపిల్స్ - ఒక్కొక్క శాంపిల్ ఒక పేజీ - మొత్తం 4 పేజీలు) - ( ఒక్కొక్క పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉంటే అన్నీ కాపీలు)(2-10 తరగతుల ఉపాధ్యాయులందరికి) > ఓరల్ టెస్ట్ గణితం పేపర్స్ ( రెండు శాంపిల్స్ - ఒక్కొక్క శాంపిల్ రెండు పేజీలు - మొత్తం 4 పేజీలు)) ( ఒక్కొక్క పాఠశాలలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉంటే అన్నీ కాపీలు)(2-10 తరగతుల ఉపాధ్యాయులందరికి) వ్రాత పరీక్ష తెలుగు పేపర్స్ - (పది శాంపిల్స్ - ఒక్కొక్క శాంపిల్ ఒక పేజీ - మొత్తం 10 పేజీలు) 2-5 తరగతుల విద్యార్థులకు ఒక మోడల్ ప్రశ్నా పత్రాలు ఇవ్వబడ్డాయి. 6-10 తరగతుల విద్యార్ధులకు వేరొక మోడల్ ప్రశ్నా పత్రాలు ఇవ్వబడ్డాయి.

> వ్రాత పరీక్ష ఇంగ్లిష్ పేపర్స్ ( పది శాంపిల్స్ - ఒక్కొక్క శాంపిల్ ఒక పేజీ - మొత్తం 10 పేజీలు) 2-5 తరగతుల విద్యార్థులకు ఒక మోడల్ ప్రశ్నా పత్రాలు ఇవ్వబడ్డాయి. 6-10 తరగతుల విద్యార్ధులకు వేరొక మోడల్ ప్రశ్నా పత్రాలు ఇవ్వబడ్డాయి.

> వ్రాత పరీక్ష గణితం పేపర్స్ ( పది శాంపిల్స్ ఒక్కొక్క శాంపిల్ ఒక పేజీ - మొత్తం 10 పేజీలు) 6-10 తరగతుల విద్యార్ధులకు మాత్రమే ప్రశ్నా పత్రాలు ఇవ్వబడ్డాయి.

ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య మరియు ఎయిడెడ్ పాఠశాలలలో బేస్ లైన్ అస్సెస్స్మెంట్ సక్రమంగా నిర్వహించేటట్లు తగిన పర్యవేక్షణ చేయవలసిందిగా కోరడమైనది.

*22-07-22 నుండి 26-07-22 వరకు నిర్వహించాల్సిన బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ విధానం*_ 


 _*ఇది 2 నుండి 10 తరగతుల  విద్యార్థులకు నిర్వహించాలి.*_   


_*ఇది తెలుగు,ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో నిర్వహించాలి.*_


_*ఈ పరీక్ష రెండు   పద్ధతులలో నిర్వహించాలి.*_


_*1.మౌఖిక పరీక్ష*_

_*2.వ్రాత పరీక్ష*_


_*2 నుండి 5 తరగతుల విద్యార్థులకు  ఒక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.*_

_*అలాగే 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు వేరొక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.*_

_*మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం 2 నుండి 10 తరగతులకు కామన్ గా ఉంటుంది.(తెలుగు 2 పేజీలు,ఆంగ్లం 1 పేజీ, గణితం 2 పేజీలు,మొత్తం 5 పేజీలు)*_ 

_*2 నుండి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం,గణితంలలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.*_ _*మరియు తెలుగు, ఆంగ్లం లో వ్రాత పరీక్ష నిర్వహించాలి.*_ 


_*వీరికి గణితంలో వ్రాత పరీక్ష ఉండదు. మౌఖిక పరీక్ష లోని గణిత ప్రక్రియలనే  వ్రాత పరీక్షగా పరిగణించాలి.*_


_*ఈ పరీక్షకు విద్యార్థికి ప్రశ్న పత్రం ఇవ్వబడ దు.టీచర్ కాపీ ఉపయోగించి విద్యార్థితో నోటు పుస్తకములో చేయించి స్థాయిని నిర్ధారించాలి.*_


_*6 నుండి 10 తరగతుల విద్యార్థులకు తెలుగు,ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో మౌఖిక మరియు వ్రాత పరీక్ష నిర్వహించాలి.*_


*22-07-22 న తెలుగు, 23-07-22 న ఆంగ్లం మరియు 25-07-22 న గణితం పరీక్షలు నిర్వహించాలి.*_


 _*❇️మౌఖిక పరీక్ష :❇️*_ 


_*మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం సెట్ 1 మరియు సెట్ 2 లు గా ఉంటుంది. ఇద్దరు వరుస విద్యార్థుల లో మొదటి విద్యార్థికి సెట్ 1 ఉపయోగించాలి.రెండవ విద్యార్థికి  సెట్ 2 వాడాలి. తరువాతి విద్యార్థికి సెట్*_ _*1 ...ఈ విధంగా 2 సెట్లను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.*_


_*విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠ శాల లోని అందరు ఉపాధ్యాయులు ఈ మౌఖిక పరీక్షను ( విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని పిలిచి) నిర్వహించి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలి.*_ 


_*మౌఖిక పరీక్షలో సాధించిన స్థాయిలను ఆన్లైన్ లో 26-07-22 లోగా నమోదు చేయాలి.*_


 _*❇️మౌఖిక పరీక్ష లోని స్థాయిలు :❇️*_ 


 _*ప్రారంభ స్థాయి1:*_ _*అక్షరాలను గుర్తించలేక పోవడం (తెలుగు)/ పెద్ద అక్షరాలను (క్యాపిటల్ లెటర్స్) గుర్తించలేక పోవడం ( ఆంగ్లము)/ అంకెలను గుర్తించలేక పోవడం (మేథ్స్)*_


 _*స్థాయి 2 :*_ 


_*అక్షరాలుగుర్తించడం ( తెలుగు)/ పెద్ద అక్షరాలు గుర్తించడం( ఆంగ్లం)/అంకెలను గుర్తించడం( గణితం)*_


 _*స్థాయి 3 :*_ 


_*పదాలు చదవడం ( తెలుగు)/చిన్న అక్షరాలను గుర్తించడం ( ఆంగ్లం)/ రెండంకెల సంఖ్యలను గుర్తించడం ( గణితం)*_


 _*స్థాయి 4 :*_ 


_*వాక్యాలు లేదా పేరాను చదవడం ( తెలుగు)/పదాలను చదవడం, అర్థం చెప్పడం ( ఆంగ్లం)/మూడంకెల సంఖ్యలను గుర్తించడం ( గణితం)*_


 _*స్థాయి 5:*_ 


_*కథ చదవడం ( తెలుగు)/వాక్యాలు చదవడం,అర్థం చెప్పడం ( ఆంగ్లం)/ గణిత ప్రక్రియలు చేయడం ( గణితం)*_


 _*వ్రాత పరీక్ష :*_ 


 _*మౌఖిక పరీక్ష లో 4 మరియు 5 వ స్థాయిలు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలి.*_ 


_*వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రాలు 10 సెట్లుగా ఉంటాయి.*_ 

_*1 నుండి 10 వరుస సంఖ్య కల విద్యార్థులకు వరుసగా 1 నుండి 10 సెట్ల ప్రశ్నాపత్రం లు ఇవ్వాలి.తరువాత 11  వరుస సంఖ్య కల విద్యార్థికి  సెట్1 ప్రశ్న పత్రం వస్తుంది.*_


_*ఈ విధంగా ప్రతి 10 మందికి 1 నుండి 10 సెట్ల ను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.*_


_*వ్రాత పరీక్ష నిర్వహించాక,జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిలను అంచనా వేయాలి.*_

 

 _*✳️వ్రాత పరీక్ష ద్వారా గుర్తించాల్సిన స్థాయిలు :✳️*_ 


 _*స్థాయి1:*_ 


_*అసలు చేయని వారు*_


 _*స్థాయి 2:*_ 


_*ప్రయత్నించారు,కానీ అన్నీ తప్పులే*_


 _*స్థాయి 3:*_ 


_*రెండు మాత్రమే సరిగా వ్రాశారు.*_


 _*స్థాయి 4:*_ 


_*అన్నీ సరిగా వ్రాశారు*_


_*మౌఖిక పరీక్ష,వ్రాత పరీక్ష లో విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన క్రింది ఎక్సెల్ షీట్ నందు నమోదు చేసుకొని భద్రపరచుకోవాలి. అవే వివరాలను online website నందు 26-07-22 లోగా నమోదు చేయాలి.*_


_*విద్యార్థుల సంఖ్యను బట్టి  వ్రాత పరీక్ష క్వశ్చన్ పేపర్ ను,ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి సూచనల ప్రతులు,మౌఖిక ప్రశ్నాపత్ర ములనుMEO లు  ప్రాథమిక పాఠ శాల లకు డిస్ట్రిబ్యూట్ చేయాలి.*_


_*ఉన్నత పాఠ శాల లకు పాఠశాలల వారీగా  వ్రాత ప్రశ్న పత్రం ప్యాక్ చేయబడి ఉంటుంది. మౌఖిక పరీక్ష ప్రశ్న పత్రములు,సూచనల ప్రతులు ఉన్నత పాఠ శాల లోని ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి పంపిణీ చేయాలి.*_


_*పరీక్ష నిర్వహణ విధానం స్పెసిఫిక్ ఇంస్ట్రక్ష న్స్ కొరకు pdf format లోని ఇంస్ట్రక్ష న్స్ మాన్యూయల్ ను చడగలరు.*_


 _*ముఖ్య సూచన:*_ 


_*ప్రారంభ పరీక్షకు అందరు విద్యార్థులు హాజరగునట్లు చూడాలి. ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయితే వారికి మరుసటి రోజైనా సరే పరీక్ష నిర్వహించి స్థాయిలను గుర్తించాలి.*_


_*ప్రారంభ పరీక్ష ఫలితాలను ప్రతి పాఠ శాల లో విజిటింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.*_


_*విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత , 1,2,3,4 స్థాయిలలో ఉన్న విద్యార్థులను 5 వ స్థాయికి తీసుకురావడానికి  పాఠ శాల remedial teaching plan( ప్రత్యామ్నాయ బోధనా ప్రణాళిక) తయయారుచేసి అమలు చేయాలి.*_ 


 _*విజిటింగ్ అధికారులు పాఠ శాల సందర్శించినప్పుడు బేస్లైన్ టెస్ట్ లో స్థాయి కంటే విద్యార్థి యొక్క actual స్థాయి తక్కువగా ఉండరాదు.*_


_*కావున విద్యార్థుల actual స్థాయిలను నిర్ధారించే లా పరీక్ష నిజాయితీగా , కాపీ కి ఆస్కారం లేకుండా నిర్వహించాలి.*_


_*ఈ నూరు రోజుల కార్యక్రమం పూర్తయ్యే నాటికి  పాఠ శాల లోని విద్యార్థులందరూ 5 వ స్థాయికి చేరుకోవాలి.*_


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top